బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఏమనిపిస్తే అదే మాట్లాడుతుంటుంది. ఎలాంటి మొహమాటాలు పెట్టుకోదు. సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలు ఇలా చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఇటీవలే కర్ణాటక హిజాబ్ వివాదంపై కామెంట్స్ చేసిన ఈ భామ.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే సినిమాపై విమర్శలు చేసింది.
ప్రముఖ దర్శకుడు శకున్ బత్రా దర్శకత్వంలో దీపిక పదుకొనే నటించిన లేటెస్ట్ సినిమా ‘గెహ్రాయాన్’. అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఓ వర్గం ఆడియన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో దీపికా.. తన కోస్టార్ సిద్ధాంత్ చతుర్వేదితో రొమాంటిక్ సీన్లలో నటించింది.
సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే హాట్ టాపిక్ అయింది. సినిమాలో మరిన్ని హాట్ సీన్స్ ఉండడంతో.. కంగనా ఈ సినిమాపై రియాక్ట్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టోరీలో మనోజ్ కుమార్ సినిమా ‘హిమాలయ కి గాడ్ మై’లోని ఛాంద్ సి మెహబూబా సాంగ్‌ని షేర్ చేసింది కంగనా. దానికి.. ‘నేనూ నవతరానికి చెందిన వ్యక్తినే కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను.
దయచేసి మిలీనియల్, న్యూ ఏజ్, అర్బన్ సినిమాల పేరుతో చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలే. స్కిన్ షో లేదా అశ్లీలత వాటిని ఏ మాత్రం కాపాడలేవు. ఇది బేసిక్ గా వాస్తవం. ‘గెహ్రియాన్’ సినిమా గురించయితే మాట్లాడలేదు’ అంటూ రాసుకొచ్చింది.