కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ల మధ్య మెయిల్ వార్ నడుస్తుండగానే.. కంగనా మాజీ ప్రియుడు ఆధ్యాయన్ సుమన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ కంగనా పూజ చేయాలని ఒకరోజు నన్ను తన ఇంటికి రమ్మని పిలవడంతో నేను వెళ్ళాను. తన ఇంట్లో ఓ చిన్న గెస్ట్ రూమ్ ఉంది. అది మొత్తం చీకటిగా ఉండటంతో పాటు, బయట వ్యక్తులకు కనపడకుండా ఉండేందుకు నల్లటి వస్త్రాలతో చుట్టూ కప్పబడి ఉంది.
దేవతా విగ్రహాలు ఎక్కడ బడితే అక్కడ ఉంచడం తో పాటు చుట్టూ కూడా చిన్న మంట ఉంచారు. సరిగ్గా రాత్రి 11.30 దాటిన తరువాత 12 గంటలకు కంగనా ఏవో కొన్ని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంది. నన్ను కూడా వాటిని ఉచ్చరించమని చెప్పింది. నాకు చాలా భయం వేసింది. అయితే నేను ఆ మంత్రాలను చెప్పలేదు. కానీ వాటిని చెప్పినట్లుగా తనతో చెప్పాను. ఈ సంఘటన తరువాత పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాజ్ 2 చిత్రం తరువాత నన్ను ఎవరూ కూడా పట్టించుకోలేదు. క్రమక్రమంగా నా చిత్రాలు పరాజయాలు పొందగా.. కంగనాకు పేరు ప్రఖ్యాతలు పెరిగిపోయాయ’ని ఆధ్యాయన్ వెల్లడించాడు. ఈ ఘటన బాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయని అంటున్నారు.