Kangana: నాలో యాక్టర్ ను గుర్తించింది అతనే!: కంగనా

ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి కంగనా రౌనత్. ఇలా తెలుగులో ఈ సినిమాలో నటించినటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. ఇలా ద్వారా ఎన్నో కాంట్రవర్సీలు జరగడంతో ఏకంగా ఈమెకు కాంట్రవర్సీ క్వీన్ అనే పేరు కూడా పెట్టేశారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి బాలీవుడ్ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ కంగనా చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారి తీస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కంగనా బాలీవుడ్ సినిమాలను కాస్త తగ్గించి సౌత్ సినిమాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇలా ఈమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా కంగనా నటించిన చంద్రముఖి 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి కంగానా సౌత్ సెలబ్రిటీల గురించి పలు విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పలు విషయాలు వెల్లడించారు. నేను సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం పూరీ జగన్నాథ్ నాలోని యాక్ట్రెస్ కి గుర్తించినది పూరి జగన్నాథం అని తెలిపారు.

ఇలా నేను కెరియర్ పరంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతానని ఆయన ముందుగానే ఊహించారు. దీంతో నాకు మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో అవకాశం కల్పించి ఈ సినిమా ద్వారా నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. అయితే ఆ సమయంలోనే నేను గ్యాంగ్ స్టర్ సినిమాలో నటించడం వల్ల మహేష్ బాబు పోకిరి సినిమా అవకాశాన్ని వదులుకున్నాను. ఈ సినిమా వదులుకొని ఇప్పటికి తాను బాధపడుతూనే ఉంటానని కంగనా వెల్లడించారు. ఇక ఈ సినిమా వదులుకోవడంతో ఏక్ నిరంజన్ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ నన్ను టాలీవుడ్ కి పరిచయం చేశారని ఈమె వెల్లడించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus