సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ సాధారణం అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ హిట్ కొట్టాక దానిని కొనసాగించేందుకు సెకండ్ పార్టు తీస్తుంటారు. కొన్ని సార్లు వారు చేసిన ప్రయత్నం విఫలమైనా.. కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్ సాధించాయి. అలా కోలీవుడ్లో చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి పార్టు 1 ఎంతటి సంచలన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా జ్యోతిక నటన హైలెట్. ఆ సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.
ఈ సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి-2 గా 28న థియేటర్లలోకి రాబోతుంది. చంద్రముఖి పార్ట్ 1 మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు మూవీ టీం రెడీగా ఉంది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించిన కంగనా రనౌత్ గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు దాదాపుగా రూ.20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
కంగనా ఎంత బాలీవుడ్ యాక్టర్ అయినా…. ఆమెకు (Kangana Ranaut) కాస్త యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నా.. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ అంటే నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈమెకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఓ మీడియం బడ్జెట్ సినిమా తీయొచ్చని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కంగనా రనౌత్ కెరీర్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. ఈమెకు అవకాశం ఇవ్వడం వల్ల లాభం కంటే.. కాస్త నష్టమే ఎక్కువగా ఉందని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే ఆ సినిమా అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచలేకపోతోంది. చంద్రముఖి ఓ క్లాసికల్ అని ఈ సినిమాకు సీక్వెల్ తీసి మెప్పించాలంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. రాఘవ లారెన్స్ ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకొని రిస్కు చేస్తున్నాంటూ ఆయన ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.