ఈ ఏడాది జూలై లో వచ్చి ప్లాప్ గా మిగిలిన తమిళ చిత్రం ‘ఆడై’. అమలాపాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం చప్పుడు చేయకుండా వెళ్ళిపోయింది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ డైరెక్షన్ లోపం వల్ల ప్లాప్ అయినట్టు విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. అయితే అమలా పాల్ కు మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఇప్పుడు ‘ఇదే కథను కొద్దిగా మార్చుకుంటే బాలీవుడ్ లో హిట్టు కొట్టొచ్చు అనే ఉద్దేశంతో, హిందీ రీమేక్ హక్కులను విక్రమ్ భట్ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ పాత్రకి కంగనా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెతో సంప్రదింపులు మొదలెట్టాడట. కథా కథనాలు .. మేకింగ్ విషయంలో కంగనా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమె ఈ కథని యక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి..!