గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని అతి తక్కువ సమయంలో తెరకెక్కించిన క్రిష్ తెలుగు చిత్ర ప్రముఖులు అభినందించారు. అతని ప్రతిభని గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వీరనారిగా కీర్తి పొందిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితాన్ని వెండితెరపై చూపించే బాధ్యతను అప్పగించింది. ఈ చిత్రానికి “మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ” అనే టైటిల్ ఖరారు చేసి దాదాపు 90 శాతం షూటింగ్ ని క్రిష్ పూర్తి చేశారు. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న ఈ మూవీ మిగిలిన షూటింగ్ కి క్రిష్ వెల్లాసి ఉండగా.. మహానుభావుడు నందమూరి తారకరామారావు బయోపిక్ ని డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది.
దీంతో మణికర్ణిక ప్రాజక్ట్ కి డేట్స్ కేటాయించడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో కంగనా కఠిన నిర్ణయం తీసుకుంది. క్రిష్ పేరును తొలగించింది. రీసెంట్ గా జరుగుతున్న షూటింగ్ క్లాప్ బోర్డు పై డైరక్టర్ గా తన పేరుని వేసుకుంది. ఇది ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇదివరకు రచయిత అపూర్వ అస్రానీతో కంగనా గొడవ పెట్టుకుంది. అతడు రాసిన కథకు తానే రచయిత అని పేరు వేయించుకుని ఆ క్రెడిట్స్ ని కొట్టేసింది. దీనిపై ఇప్పటికీ అతడు గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్- రాకేష్ రోషన్ లతో గొడవలు వేరే కథ. ఇప్పుడు క్రిష్ కష్టాన్ని తన అకౌంట్ లోకి వేసుకోవాలని చూస్తోంది. దీనిపై క్రిష్ స్పందించే విధానం బట్టి గొడవ పెద్దది అవుతుందా? లేదా? అనేది ఆధారపడి ఉంది. అయినా నెటిజనులు మాత్రం కంగనా చేసిన పనిని విమర్శిస్తూనే ఉన్నారు. ఎలాగైనా 2019 జనవరి 25న మణికర్ణిక చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే కంగనాతో మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.