Kanguva Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కంగువా’!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ( Suriya) , దర్శకుడు ‘సిరుతై’ శివ (Siva)  కాంబినేషన్లో రూపొందిన ‘కంగువా’ (Kanguva) సినిమా ఈ ఏడాది ఎక్కువ హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ఒక్కటి. నవంబర్ 14న విడుదలై ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ కొంత పర్వాలేదు అనిపించినా… తర్వాత డౌన్ అయిపోయింది. కొంత భాగం ట్రిమ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అలా ఫైనల్ గా ఈ సినిమా టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయింది అని చెప్పాలి.

Kanguva Collections:

ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.01 cr
సీడెడ్ 1.09 cr
ఉత్తరాంధ్ర 1.20 cr
ఈస్ట్ 0.38 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.32 cr
కృష్ణా 0.53 cr
నెల్లూరు 0.16 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.93 cr

‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.6.93 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.07 కోట్ల దూరంలో ఆగిపోయి.. డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా. సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే.. కచ్చితంగా సూర్య కెరీర్లో ఇది హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించి ఉండేది.

ఆ నటిని లింక్ చేస్తూ ‘లక్కీ భాస్కర్’ నటుడిపై కామెంట్స్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus