బాలీవుడ్ లో సెటిల్ అవుతున్న సైజ్ జీరో రైటర్

అనుష్క అభిమానులందరూ బండబూతులు తిట్టుకొనే సినిమా “సైజ్ జీరో”. ఆ సినిమా కోసమే 30 కేజీల బరువు పెరిగిన అనుష్క.. కారణాంతరాల వలన అప్పటినుంచి తగ్గడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ తగ్గలేక నానా ఇబ్బందులుపడుతొంది. ఇటీవల పట్టిసీమ వెళ్లిన అనుష్క ఫోటోలు చూసి ఆమె హార్డ్ కొర్ ఫ్యాన్స్ సైతం షాక్ కు గురయ్యారు. ఆ సినిమాకు కథ అందించిన కనికా థిల్లాన్ అనే లేడీ ఎవరికీ పెద్దగా తెలియదు.

అయితే.. ఆవిడ మరెవరో కాదు ప్రకాష్ కోవెలమూడి అదేనండి.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి అబ్బాయి ఎక్స్ వైఫ్ అన్నమాట. ఎక్స్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. కొన్నేళ్ల క్రితం ఇద్దరు వేరు పడ్డారు. అఫీషియల్ గా డివోర్స్ ఎనౌన్స్ చేయలేదు కానీ.. ఆల్మోస్ట్ అందరికీ వారు విడిపోయారని విషయం తెలిసిపోయింది. అయితే.. ఇప్పుడు ఆ విషయాన్ని అఫీషియల్ చేస్తూ కనికా థిల్లాన్ రెండో పెళ్ళికి సిద్ధమైంది. బాలీవుడ్ ఫేమస్ రైటర్, ప్రొడ్యూసర్ హిమాన్షుతో కనికా థిల్లాన్ ఎంగేజ్ మెంట్ నిన్న ఘనంగా జరిగింది.

బాలీవుడ్ లో పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేస్తున్న కనికా ఇప్పటివరకు కమర్షియల్ హిట్ అందుకోలేకపోయినప్పటికీ.. ఆమె స్కిల్స్ కు మంచి రివ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ప్రొడ్యూసర్ & రైటర్ ని పెళ్లి చేసుకోబోతొంది కాబట్టి.. హ్యాపీగా బాలీవుడ్ లో రచయిత ద్వయంలా సెటిల్ అయిపోతారేమో వీరిద్దరూ. మరి ప్రకాష్ కోవెలమూడి ఇప్పటికైనా నెక్స్ట్ స్టెప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా అఫీషియల్ చేస్తాడేమో చూడాలి.

1

2

3

4

5

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus