కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి భార్య, శాండల్ వుడ్ నటి రాధికా కుమారస్వామి చీటింగ్ కేసులో చిక్కుకుంది. ఒక చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుండి రాధికా బ్యాంక్ ఖాతాకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని తెలుసుకున్న.. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెకి సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. దీంతో శుక్రవారం నాడు రాధికా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది యువకుల వద్ద లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన యువరాజ్ అలియాస్ స్వామి అనే 52 ఏళ్ల వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతేడాది డిసెంబర్ లో అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా యువరాజ్ బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 75 లక్షలు రాధికా కుమారస్వామికి అకౌంట్ కి బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో ఆమెని విచారించడానికి సమన్లు జారీ చేశారు. అయితే.. యువరాజ్ తో తనకు పరిచయం ఉన్న విషయాన్ని రాధికా కుమారస్వామి ప్రెస్ మీట్ లో అంగీకరించింది. యువరాజ్ కి ప్రొడక్షన్ హౌస్ ఉందని.. ఆయన తీస్తోన్న సినిమాలో తనను నటించమని కోరడంతో అంగీకరించానని రాధికా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తనకు రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పి.. ఆ డబ్బుని తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినట్లు
మిగిలిన అరవై లక్షల గురించి మీడియా ప్రశ్నించగా.. యువరాజ్ బావమరిది అకౌంట్ నుండి తనకు ఆ డబ్బు బదిలీ అయిందని.. వెంటనే ఆ డబ్బుని వెనక్కి ఇచ్చేశానని తెలిపింది. యువరాజ్ తన కుటుంబానికి జ్యోతిష్కుడిగా వ్యవహరించాడని.. తన విషయంలో ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని వెల్లడించింది. యువరాజ్ ను తను ఎంతగానో నమ్మానని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి షాకయ్యానని చెప్పుకొచ్చింది.