Jr NTR, Prashanth Neel: నీల్ – తారక్.. ఫైనల్ గా ఆమెనే సెలెక్ట్ చేశారుగా..!

KGF – సలార్ (Salaar) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ (Prasanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

Jr NTR, Prashanth Neel:

తాజాగా కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను (Rukmini Vasanth) ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈమె పేరు గతంలో కూడా వినిపించినప్పటికీ, అప్పట్లో తనను ఎవరూ సంప్రదించలేదని రుక్మిణి క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు మేకర్స్ ఆమెను అధికారికంగా ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బగీరా’ మూవీలో రుక్మిణి శ్రీమురళీకి జోడీగా నటించింది. ఆ సినిమాతో పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ, ఆమె నటన ప్రశంసలు అందుకుంది.

ఇక శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) సరసన నటించిన ‘భారతి రంగల్’ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ చర్చనీయాంశమైంది. ఈ హిట్ మూవీతో రుక్మిణి క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో ఆమెకు కొత్తగా కెరీర్ బూస్ట్ లభించే అవకాశం కనిపిస్తోంది. మేకర్స్ రుక్మిణి వసంత్‌తో ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకున్నారని, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఆమె కొత్త సినిమాలను సైన్ చేయకూడదని షరతు పెట్టినట్లు టాక్. అయితే, ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండొచ్చని కూడా సమాచారం.

‘సలార్’లో శృతి హాసన్  (Shruti Haasan) పాత్రకు సమానమైన రేంజ్‌లో రుక్మిణి పాత్ర ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, ఆమె పాత్ర కీలకమైన దృశ్యాలకు మాత్రమే పరిమితమవుతుందా అనే ప్రశ్న అభిమానులలో తలెత్తుతోంది. ఇక రుక్మిణి ఎంపిక మేకర్స్‌కు సరైన నిర్ణయంగా మారుతుందనేది కొందరి అభిప్రాయం. కానీ ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫైనల్ గా మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

ప్రభాస్ హీరోయిన్.. ఏడాది వరకు మరో సినిమా ఒప్పుకోదట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus