ఒకప్పుడు శాండల్ వుడ్ నుంచి వచ్చే సినిమాలు అక్కడవరకే పరిమితమయ్యేవి. కన్నడ నుంచి ఎక్కువగా రీమేక్ సినిమాలే వచ్చేవి. దీంతో ఇతర ఇండస్ట్రీలు పెద్దగా పట్టించుకునేవి కావు. బడ్జెట్ కూడా ఇరవై, ముప్పై కోట్లు దాటేది కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కన్నడ సినిమాలపై అందరి దృష్టి పడుతోంది. ఒకప్పటితో పోలిస్తే కన్నడ సినిమాలు బాగా పాపులర్ అవుతున్నాయి. అక్కడి మేకర్స్ తమ క్రియేటివిటీతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
‘కేజీఎఫ్’తో ఈ క్రేజ్ మొదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ‘కేజీఎఫ్2’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన ‘777 ఛార్లీ’ దేశవ్యాప్తంగా విజయం సాధించింది. ఈ సినిమా చూసి చాలా మంది ఎమోషనల్ అయ్యారు. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందంటే.. అమెజాన్ ప్రైమ్ లో కూడా పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు.
సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ‘కాంతారా’ వంతు వచ్చింది. కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ రిలీజ్ కి ముందు ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ లేవు. దీంతో తొలిరోజు థియేటర్లలో జనాలు లేరు. మార్నింగ్, మ్యాట్నీ షోలు ఖాళీ. కానీ సాయంత్రం షోల నుంచి జనాలు ఎగబడ్డారు. రిపీటెడ్ ఆడియన్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది.
నిజానికి ఇది కమర్షియల్ సినిమా కాదు. మన నేటివిటీకి ఏ మాత్రం సంబంధం లేని సినిమా. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి మన ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో రివ్యూలు కూడా బాగున్నాయి. ఇదంతా చూస్తుంటే.. ఇప్పుడు కన్నడ సినిమా హవా నడిచేలా ఉంది. పక్క రాష్ట్రాల వారు కన్నడ కథలను రీమేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Most Recommended Video
ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!