Yash, Deepika: ఆ బ్యూటీతో కలిసి నటించాలనుకుంటున్న యష్!

  • April 22, 2022 / 07:18 PM IST

కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యష్.. ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. రాకీభాయ్ గా అందరికీ దగ్గరయ్యాడు. ఇటీవల విడుదలైన ‘కేజీఎఫ్2’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతోంది. మొదటివారంలోనే ఈ సినిమా ఏడొందల కోట్లను సాధించింది. ఈ సినిమా రిలీజ్ తరువాత కూడా చిత్రబృందం ప్రమోషన్స్ చేస్తూనే ఉంది.

Click Here To Watch NOW

హీరోయిన్ శ్రీనిధి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. హీరో యష్ కూడా వీలైనన్ని మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటివరకు యష్ కన్నడ ముద్దగుమ్మలతోనే కలిసి నటించారు. ఇప్పుడు అతడి ఇమేజ్ పెరిగింది కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్స్ అతడితో కలిసి నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే యష్ కి మాత్రం ఓ హీరోయిన్ తో కలిసి నటించాలని ఉందట.

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. తనకు దీపికా అంటే చాలా ఇష్టమని.. ఆమె నటించే అన్ని సినిమాలు చూస్తుంటానని.. ఆమె నటన అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అలాగే ఆమెతో కలిసి నటించాలనేది తన కోరిక అంటూ బయటపెట్టారు.మరి ఈ కాంబినేషన్ ని సెట్ చేయడానికి ఏ దర్శకుడైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. ఈ మధ్యకాలంలో దీపికా పదుకోన్ దక్షిణాది హీరోలతో కూడా కలిసి నటిచడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తోంది. ఇప్పుడు యష్ లాంటి హీరోతో ఛాన్స్ వస్తే నో చెప్పేదేమో..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus