మహేష్, శ్రీమురళి… అంతా కల్పితమేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్,బాలీవుడ్ లో కూడా మహేష్ బాబు కి మంచి క్రేజ్ ఉంది. షారూఖ్ దగ్గర్నుండీ విజయ్ సేతుపతి వరకూ .. ఎవరైనా దగ్గరలో మహేష్ షూటింగ్ జరుగుతూ ఉంటే.. మహేష్ ని కలిసి వెళ్తూంటారు. తాజాగా కన్నడ స్టార్ హీరో శ్రీ మురళి కూడా మహేష్ ని కలిసాడు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో శ్రీమురళి నటిస్తున్న ‘భారాటి’ అనే కన్నడ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మరో పక్క మహేష్ బాబు ‘మహర్షి’ షూటింగ్ కూడా జరుగుతుంది. దీంతో ఇద్దరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. శ్రీ మురళి సూపర్ హిట్ చిత్రం ‘ఉగ్రం’ గురించి కూడా డిస్కస్ చేసుకున్నారట.

అంతే … ఇక మహేష్ సినిమాలో శ్రీమురళి ఓ పాత్ర చేస్తున్నాడంటూ రూమర్స్ మొదలయ్యిపోయాయి. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’ చిత్రంలో శ్రీ మురళి ఓ పాత్ర చేయబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అలాంటిదేమి లేదని మహేష్ బాబు టీం స్పష్టం చేసింది. ఇక వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న’మహర్షి’ చిత్రం మార్చి మొదటి వారంలో పూర్తికానుందట. ఏప్రిల్‌ 25 విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌’ ‘వైజయంతి మూవీస్‌’ ‘పీవీపీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus