మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు అయినటువంటి ‘కన్నప్ప’ (Kannappa) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించడం జరిగింది. మోహన్ లాల్ (Mohanlal) , మోహన్ బాబు(Mohan Babu) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి ఎంతో మంది స్టార్స్ నటిస్తున్న సినిమా ఇది. తాజాగా టీజర్ ని వదిలారు.
‘కన్నప్ప’ (Kannappa) టీజర్.. 1 : 24 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘గూడాల మీదకి గండాలు దండెత్తుకొస్తున్నాయి’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఒక గూడెం ప్రజల మీదకి బందిపోట్లు వంటి జనాలు దాడి చేయడానికి వెళ్లడం.. ‘శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది’ అంటూ మోహన్ బాబు రోల్ ఎంట్రీ ఇవ్వడం. ఆ వెంటనే మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చి ‘వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి. తేల్చుకుందాం.ఇది నా ఆన. తిన్నడి ఆన.’ అంటూ అగ్రెసివ్ గా డైలాగ్ చెప్పడం జరిగింది.
‘ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవతా? అంటూ మళ్ళీ మంచు విష్ణు పలికిన డైలాగ్ ను బట్టి.. అతను నాస్తికుడిగా కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ వెంటనే శివపార్వతులుగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కాజల్ (Kajal Aggarwal) ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రుద్రగా ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చివర్లో ప్రభాస్ ను (Prabhas) బాగానే హైలెట్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి :