Kantara: ‘ కాంతార’ చిత్రంలో ఆ పాత్రలకు డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..!

ఈ ఏడాది సౌత్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్ తీసుకుంటే ఇందులో ‘కాంతార’ కూడా ఉంటుంది.కన్నడ మూవీనే అయినప్పటికీ భారీ కలెక్షన్లు సాధించింది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇప్పటికీ అన్ స్టాపబుల్ అనే విధంగా దూసుకుపోతుంది. ఈ చిత్రం కొనుగోలు ప్రతి బయ్యర్ రెండింతల లాభాలను ఆర్జించడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగులో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ తన ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అనువదించి రిలీజ్ చేయడం జరిగింది.

తెలుగులో కూడా ఈ మూవీ రూ.25 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భూత కోలా, క్లైమాక్స్ పార్ట్ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెప్పాలి. ఇది హారర్ సినిమా కాదు కానీ సినిమా చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. ఇలాంటి రా అండ్ రస్టిక్ సినిమాలకు డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు ఆ ఫీలింగ్ కలగలేదు అంటే అది కచ్చితంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ ల గొప్పతనం అనే చెప్పాలి.

‘కాంతార’ తెలుగు వెర్షన్ కు డబ్బింగ్ చెప్పిన వారు తమ టాలెంట్ తో ఈ పాత్రలకు జీవం పోశారు అని చెప్పొచ్చు.హీరో రిషబ్ శెట్టి పోషించిన శివ పాత్రకు డబ్బింగ్ చెప్పింది భార్గవ్. హీరోయిన్లు సప్తమి గౌడ పోషించిన లీల పాత్రకు డబ్బింగ్ చెప్పింది హరిణి. హీరో తల్లి మానసి సుధీర్ పోషించిన కమల పాత్రకు డబ్బింగ్ చెప్పింది క్రాంతి, రంప పాత్ర చేసిన ప్రకాష్ తుమినాడ్ కు డబ్బింగ్ చెప్పింది సోనూ.

వీళ్ళు ఎంతో ఇంటెన్సిటీ డబ్బింగ్ చెప్పి తెరవెనుక పిల్లర్స్ గా నిలిచారు. మరి ఈ పాత్రలకు డబ్బింగ్ చెప్పినందుకు గాను ఎంత పారితోషికం ఇచ్చారు అని వీరినడుగగా… అది పైకి చెప్పలేము కానీ అనుకున్నట్టుగానే మంచి పారితోషికం ఇచ్చారు. అలాగే సినిమాకి మరీ ముఖ్యంగా మా డబ్బింగ్ కు మంచి పేరు రావడంతో మాకు 10 రెట్లు పేరు వచ్చింది. కాబట్టి ‘కాంతార’ మాకు రెండు విధాలుగా సంతృప్తినిచ్చింది అంటూ వీళ్ళు చెప్పుకొచ్చారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus