Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 30, 2026 / 04:32 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ధనుష్ (Hero)
  • మామితా బైజు (Heroine)
  • కె.ఎస్.రవికుమార్, సూరజ్ వెంజరమూడు,పృథ్వీ పాండిరాజన్, శ్రీజ రావి, ఎం ఎస్ భాస్కర్ తదితరులు (Cast)
  • విగ్నేష్ రాజా (Director)
  • డా. ఐషరి కె. గణేష్ (Producer)
  • జీ వీ ప్రకాష్ కుమార్ (Music)
  • తేని ఈశ్వర్ ఐ ఎస్ సి (Cinematography)
  • శ్రీజిత్ సారంగ్ (Editor)
  • Release Date : 30th ఏప్రిల్ 2026
  • వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ (Banner)

గతేడాది ‘కుబేర’ ‘ఇడ్లీ కొట్టు’ ‘తేరే ఇష్క్ మే’ వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ధనుష్ ఇప్పుడు ‘కర’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మామితా బైజు హీరోయిన్ కావడం.. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో ‘కర’ పై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఫోకస్ పెట్టారు. మరి ఆ హైప్ కి తగ్గట్టు ఈ సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి:

Kara Movie Review

Kara Movie Review and Rating

కథ: కరస్వామి లైయస్ కర(ధనుష్) ఒక దొంగ. తండ్రి కందసామి(కె ఎస్ రవికుమార్) వద్ద డబ్బు కాజేసి ఇంట్లో నుండి పారిపోయిన అతను.. పెద్ద దొంగ అవుతాడు కానీ ప్రయోజకుడు అవ్వడు. తర్వాత మల్లిని(మామితా బైజు) ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అతను దొంగ అని తెలిసినా ఆమె కరని ప్రేమిస్తుంది. కానీ వివాహం తర్వాత దొంగతనాలు మానేయాలని మాట తీసుకుంటుంది. అయితే తన స్నేహితడు మురుగేశన్(పాండిరాజన్) చివరిగా ఓ దొంగతనం చేయాలని డిసైడ్ అవుతాడు కర. అదే అతని ఆఖరి దొంగతనం అవ్వాలని రంగంలోకి దిగుతాడు.

కానీ ఊహించని విధంగా పోలీసులకి చిక్కుతాడు. రిటైర్ అవ్వడానికి దగ్గరలో ఉన్న డీఎస్పీ భరతన్(సూరజ్ వెంజరమూడు) ఇతని కేసుని టేకప్ చేస్తాడు. రిటైర్ అయ్యే టైంకి తనకి పబ్లిసిటీ బాగా జరగాలని భరతన్ ఆశపడతాడు. అందుకే కర కేసుని పై ఆఫీసర్ ని రిక్వెస్ట్ చేసి మరీ అతను టేకప్ చేస్తాడు. అయితే అతన్ని కొట్టి కర పారిపోతాడు. తర్వాత అతని భార్య మల్లి చెప్పినట్టు బుద్దిగా ఒక హోటల్లో పనిచేసుకుంటూ ఉంటాడు. కానీ సొంత ఊరు కోసం మళ్ళీ అతను దొంగగా మారాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏంటి? పోలీసుల వల్ల కర జీవితం చివరికి ఏమైంది? అనేది మిగిలిన కథ.

Kara Movie Review and Rating

నటీనటుల పనితీరు: ధనుష్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పుకోవాలా.? ఈ సినిమాలో కూడా తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. అయితే ఒక్క సీన్లో కూడా నవ్వకుండా బహుశా ధనుష్ చేసిన సినిమా ఇదే కావచ్చు. సినిమా మొత్తం సీరియస్ గానే ఉంటుంది అతని పాత్ర. మామితా బైజు హీరో భార్య పాత్రలో బాగానే సెట్ అయ్యింది. కానీ ఈమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ లభించలేదు. కె ఎస్ రవికుమార్ మాత్రం తండ్రి పాత్రలో అదరగొట్టేశాడు. అతని మేకోవర్ చాలా నేచురల్ గా ఉంది. పెర్ఫార్మన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు. అలాగే సూరజ్ వెంజరమూడు కూడా డీఎస్పీ పాత్రలో పరకాయప్రవేశం చేసేశాడు. జయరాం కూడా బాగానే చేశాడు. మిగతా నటీనటులు ఓకె.

Kara Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: ‘పోర్ తొజిల్’ సినిమా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. అది చూసిన వారందరికీ దర్శకుడు విగ్నేష్ రాజా పనితనం, టాలెంట్ అర్ధమవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే అతన్ని ధనుష్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. ‘కర’ కోసం దర్శకుడు విగ్నేష్ తీసుకున్న పాయింట్ కూడా చాలా బాగుంది. గల్ఫ్ దేశాల్లో యుద్ధం.. అందువల్ల ఇండియాలో ఆయిల్(ఫ్యూయల్) కొరత సంభవించడం అనేది గతంలోనూ జరిగింది. 1973 టైమ్లో కూడా ఇలాంటి పరిస్థితి సంభవించింది. ప్రస్తుతం ఫ్యూయల్ కొరత అనేది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి అందరూ ఎక్సైట్ అవుతారు అనడంలో సందేహం లేదు. అలాగే దర్శకుడు ఆ టైమ్ పీరియడ్ ని తీసుకుని ఈ కథ అల్లినట్టు కూడా అర్దం చేసుకోవచ్చు. ధానికి రైతుల సమస్యలు, వాళ్ళని బ్యాంకుల వాళ్ళు వేధిస్తున్న విధానాన్ని సింక్ చేస్తూ చాలా ఎమోషనల్ గా కథనాన్ని నడిపించాడు.

అంతేకాదు హీరో దొంగతనాలు చేసే ఎపిసోడ్స్, యాక్షన్ సన్నివేశాలు కూడా రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి.ఇంకా మైండ్ గేమ్స్ ప్లే చేసే విధానం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ స్టెప్ తీసుకోలేదు. నెరేషన్ అక్కడక్కడ స్లోగా ఉంది. కొన్ని సన్నివేశాలు లెంగ్తీగా కూడా అనిపిస్తాయి. అయితే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో రూపొందిన పాటలు అంతగా గుర్తుండవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కథ మూడ్ ని క్యారీ చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టే ఉన్నాయి. 1970..ల సెటప్ తీసుకురావడంతో ప్రొడక్షన్ డిజైన్ కూడా సక్సెస్ అయ్యింది.

Kara Movie Review and Rating

విశ్లేషణ: కరెంట్ ట్రెండ్ ని కి తగ్గట్టు ఓ సోషల్ ఇష్యూని దర్శకుడు అడ్రెస్ చేసిన విధానం బాగుంది. కాకపోతే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కొంచెం స్లో నెరేషన్, లెంగ్తీ సన్నివేశాలు మినహాయిస్తే ‘కర’ని ఈ వీకెండ్ థియేటర్లలో ఒకసారి ట్రై చేయొచ్చు.

Kara Movie Review and Rating

ఫోకస్ పాయింట్: ట్రెండింగ్ పాయింట్ తో.. ఓకే అనిపించే పీరియాడిక్ సోషల్ డ్రామా

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kara Movie
  • #Mamitha Baiju
  • #Vignesh Raja

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

3 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version