గత మూడు రోజుల క్రితం యూసఫ్ గూడలోని యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి నటి కరాటే కళ్యాణి అతనితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి రోడ్డుపై మహిళల పట్ల అభ్యంతరకరమైన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నారు అంటూ కరాటే కళ్యాణి అతనితో గొడవకు దిగింది.ఈ విధంగా వీరిద్దరి మధ్య పరస్పరం మాటలు పెరిగి చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి అనంతరం ఇద్దరూ వెళ్లి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇకపోతే కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేయడానికి వెళ్లిన సమయంలో తన చేతిలో చిన్నారి ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఆ చిన్నారి ఎవరు ఏంటి అంటూ పలువురు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఫిర్యాదులు అందుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కరాటే కళ్యాణి ఇంటిలో సోదా చేశారు. ఈ సమయంలో కరాటే కళ్యాణి ఇంటిలో లేకపోయినప్పటికీ ఆమె తల్లి, తన సోదరుడు ఇంట్లో ఉండడంతో అధికారులు వీరిని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి ఇంటిలో ఉన్న చిన్నారి ఎవరు ఏంటి అని పెద్ద ఎత్తున అధికారులు ఆరాతీయగా ఈ విషయంలో తన కూతురు తప్పు ఏమాత్రం లేదని కరాటే కళ్యాణి తల్లి అధికారులకు వెల్లడించారు. చిన్నారి విషయంలో తమ తప్పు ఏమాత్రం లేదని చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నానని ఈ సందర్భంగా కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి అధికారులకు తెలిపారు. కళ్యాణి 12 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని పెంచుకోవడమే కాకుండా, అమ్మాయిని కూడా దత్తత తీసుకొని పెంచుకుంటున్నారనీ విజయలక్ష్మి వెల్లడించారు.
ఈ చిన్నారిని చట్టప్రకారం శ్రీకాకుళం నుంచి దత్త తీసుకున్నామని, చిన్నారికి మౌక్తిక అని పేరు పెట్టామని ఈమె వెల్లడించారు.అయితే అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో కరాటే కళ్యాణి ఇంటిలో లేకపోవడంతో అధికారులు ఆమె తల్లిని ప్రశ్నించారు.