Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు
- June 1, 2026 / 03:36 PM ISTByFilmy Focus Desk
అంచనాలు లేకుండా రావడం.. రికార్డు స్థాయిలో వసూళ్లు అందించడం.. ఇండియన్ సినిమాలో కొత్తేం కాదు. చాలా సినిమాలు ఈ ఘనతను అందుకున్నాయి. అయితే ఇలాంటి సినిమాలు ఎక్కువగా మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు సినిమా పరిశ్రమలో కనిపిస్తుంటాయి. గుజరాతీ పరిశ్రమలో ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది. రీసెంట్‌గా మరాఠీ సినిమా ‘లాలో’ తరహాలో ఇప్పుడు గుజరాతీలో ‘దేవూల్ బంద్ 2’ అనే సినిమా భారీ విజయం అందుకుంది.
Deool Band 2
విజయం ఎలాంటిది అంటే.. సుమారు రూ.9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తొమ్మది రోజుల్లోనే సుమారు రూ.40 కోట్లు వసూలు చేసింది. స్నేహల్ తార్డే, మోహన్ జోషిక ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘దేవూల్ బంద్ 2’. మే నెల 21న రిలీజ్ అయిన ఈ సినిమా తొలుత పరిమిత సంఖ్యలోని స్క్రీన్‌లలో విడుదలైంది. ఆ తర్వాత 600 స్క్రీన్‌లకు పెరిగింది. మొదటి వీకెండ్‌లో సినిమా రూ.5.90 కోట్లు వసూలు చేసింది. తొమ్మిది రోజులకు ఆ వసూళ్లు సుమారు రూ.40 కోట్లకు చేరాయి.
ఈ క్రమంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మరాఠీ సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. సినిమా కథ సంగతి చూస్తే.. సంగీత పేగుడే (స్నేహల్) మహిళా రైతు. తన బాధలను తీర్చమని రోజూ దేవుడిని వేడుకుంటుంది. కానీ, ఏ ప్రయోజనం ఉండదు. ఒకరోజు తీవ్ర అసహనానికి గురై నది సమీపంలో ఉన్న చీమల పుట్టపై రాయిని విసిరికొడుతుంది. దీంతో ఆమెకు శ్రీస్వామి సమర్థ్ దర్శనమిస్తారు. ఆయన్ను తన గ్రామానికి తీసుకెళ్తుంది. స్నేహల్‌కు మాత్రమే ఆ స్వామి కనిపిస్తూ, మాట్లాడుతూ ఉంటారు. స్నేహల్ అలా మాట్లాడుతుండటంతో మతిభ్రమించిందని ఊళ్లో అనుకుంటారు.
స్వామి సమర్థ్ రాకతో స్నేహల్ జీవితంలో ఏం మార్పు వచ్చింది. నమ్మకం, విశ్వాసం, బాధ, భావోద్వేగాల మధ్య ఏం జరిగింది అనేది సినిమా కథ. ఈ సినిమాను 33 గంటల ఏకైక షెడ్యూల్‌లో ఏకధాటిగా షూటింగ్ చేసి షూటింగ్ ముగించారు.













