Karate Kalyani: ఎన్టీఆర్ ఏమైనా నిజమైన కృష్ణుడా.. నటి సంచలన వ్యాఖ్యలు!

  • May 13, 2023 / 02:13 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గతంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా అనవసర వివాదాలలో ఆమె జోక్యం చేసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుని రూపంలో పెట్టడం గురించి కరాటే కళ్యాణి వివాదం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కృష్ణుడి రూపంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లను నిలిపివేయాలని అలా చేయని పక్షంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. విగ్రహాన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తామని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి కృష్ణుడి రూపాన్ని పెట్టడం వల్ల ఎన్టీఆర్ గారే శ్రీ కృష్ణుడు అని అభిప్రాయం కలిగే అవకాశం ఉందని కరాటే కళ్యాణి వెల్లడించారు. రాబోయే తరాలు ఎన్టీఆరే భగవద్గీత బోధించాడని భావించే కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం వల్ల మానసిక క్షోభకు గురవుతామని ఆమె కామెంట్లు చేశారు. మా మనోభావాలు పట్టవా? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా? అని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధమేనని ఆమె చెప్పుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ నిజమైన కృష్ణుడా అని కరాటే కళ్యాణి పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.

నందమూరి ఫ్యాన్స్ మాత్రం (Karate Kalyani) కరాటే కళ్యాణిని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుని రూపంలో ఉండటంలో ఏ మాత్రం తప్పు లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అనవసర వివాదాలను సృష్టించవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus