ఆమెకు అంత రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి రెడీ అట

రామయాణాన్ని సీత కోణంలో చూపించేలా ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. ఈ క్రమంలో కరీనా కపూర్‌ కొన్ని కండిషన్లు పెట్టినట్లు సమాచారం. వాటిలో ఒకటి సాధారణ కండిషన్‌ అయితే, రెండోది డబ్బులకు సంబంధించింది. ‘సీత’ సినిమాకు సంబంధించి విజయేంద్రప్రసాద్‌ కథను ఎప్పుడో సిద్ధం చేశారట. దీంతో నటీనటుల ఎంపిక జరుగుతోందట.

అందులో భాగంగా కరీనా కపూర్‌ను కాంటాక్ట్‌ చేస్తే రెండు కండిషన్లు పెట్టిందట. అందులో ఒకటి ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమా పనులన్నీ పూర్తి చేశాకనే ఈ సినిమా పనిలోకి వస్తుందట. రెండోది రెమ్యూనరేషన్‌. సినిమా మొత్తం ఆమె మీద రన్‌ అవుతుంది కాబట్టి… ఏకంగా ₹12 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతోందట. అయితే ఈ విషయంలో ఓకే చెప్పిందట. కరీనాకు నిర్మాతలు అంత రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో చిత్రీకరిస్తారు. విజయేంద్రప్రసాద్‌ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. మన దగ్గర మైథలాజికల్‌ డ్రామా వచ్చి చాలా రోజులైంది. దీంతో నిర్మాతలు ఎంత ఖర్చుపెట్టడానికి రెడీ అవుతున్నారట. అయితే గత తప్పులు నుండి కోలుకొని విజయేంద్రప్రసాద్‌ దర్శకుడిగానూ వావ్‌ అనిపించుకునే అవకాశం ఈ సినిమాతో దక్కుతోంది. చూద్దాం ఏం చేస్తారో ఆయన.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus