కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అతడు నటించిన చిత్రాల్లో ‘ఖైదీ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రీమేక్, సీక్వెల్ పనులకు బ్రేక్ పడిందని తెలుస్తోంది.
ఈ సినిమా కథ విషయంలో వివాదం నెలకొనడమే దానికి కారణమని తెలుస్తోంది. ‘ఖైదీ’ చిత్ర నిర్మాత ఎస్ఆర్ ప్రభుపై కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశాడు. తన కథను దొంగిలించి ‘ఖైదీ’ తీశారని.. కాబట్టి నష్టపరిహారంగా రూ.4 కోట్లు చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసుని విచారించడానికి స్వీకరించిన కేరళ హైకోర్టు.. నిర్మాత ప్రభుకి నోటీసులు జారీ చేసింది. ‘ఖైదీ’ సినిమాను ఇతర భాషల్లో అనువదించకూడదని..
రీమేక్ పనులు ఆపేయాలని.. సీక్వెల్ తీయడానికి కూడా వీల్లేదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే హిందీ రీమేక్ పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలానే కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు సీక్వెల్ ఆలోచనను కూడా పక్కన పెట్టాల్సిందే. మరి ఈ కేసు విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!