‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నా ఇంకా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇది ప్లాప్ సినిమానే..! నిర్మాత దిల్ రాజుకి (Dil Raju) భారీ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా రిజల్ట్ ను దిల్ రాజుతో పాటు రాంచరణ్ (Ram Charan) ఫ్యాన్స్ కూడా మర్చిపోవాలి అని అంతా అనుకుంటున్నారు. కానీ మీడియాలో ఎవరొకరు ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ ను గుర్తు చేస్తూ హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే ఇందులో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రియదర్శి (Priyadarshi), నవీన్ చంద్ర (Naveen Chandra) వంటి వాళ్ళని సైతం.
.’గేమ్ ఛేంజర్’ గురించి ఏదో ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకి వాళ్ళు ఇబ్బంది పడుతూనే సమాధానం చెబుతున్నారు. తాజాగా కార్తీక్ సుబ్బరాజు కి (Karthik Subbaraj) కూడా ‘గేమ్ ఛేంజర్’ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ సినిమాకి ఆయన ఓ రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ‘రెట్రో’ (Retro) ప్రమోషన్స్ లో భాగంగా కార్తీక్ సుబ్బరాజు ‘గేమ్ ఛేంజర్’ గురించి స్పందించాల్సి వచ్చింది.
కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ… “నేను శంకర్ గారికి ‘గేమ్ ఛేంజర్’ ని ఒక లైన్ గా చెప్పాను. అప్పన్న అనే విప్లవాత్మక భావాలు కలిగిన వ్యక్తికి శరీరంలో ఒక బలహీనత ఉంటుంది. అయితే తర్వాత అతని కొడుకు… ఎలాంటి బలహీనతలు లేకుండా ఒక నిజాయితీ గల IAS ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది? అనేది నేను చెప్పిన లైన్.
కానీ దర్శకులు శంకర్ (Shankar) ఆ లైన్ కి సెపరేట్ వరల్డ్ క్రియేట్ చేశారు. అటు తర్వాత చాలా మంది రైటర్స్ వచ్చి కథని, స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు. దీంతో బేసిక్ ప్లాట్ మిస్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.