నానితో ప్రభాస్… ఆ ఫోటో వెనుక అంత కథ ఉందా?

నాని (Nani) , ప్రభాస్ కి ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్రెండ్ సర్కిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను రియల్ లైఫ్ రేలంగి మావయ్య టైపు. టాలీవుడ్లో ఉన్న నటీనటులు, టెక్నిషియన్స్… ఆఖరికి జూనియర్ ఆర్టిస్టులతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. ప్రభాస్ శీను (Prabhas Sreenu).. వంటి వాళ్ళని ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరుస సినిమాల వల్ల.. అతను ఎక్కువగా మీడియాకి కనిపించడు కానీ ఫ్రెండ్స్ తో ఎక్కువగా టచ్లోనే ఉంటాడు.

Nani, Prabhas

ఇదిలా ఉండగా.. ప్రభాస్, నాని..కలిసున్న ఓ రేర్ పిక్ ఎప్పుడూ వారియర్ అవుతూనే ఉంటుంది. దాని వెనుక ఉన్న కథని నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాని… ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటో గురించి మాట్లాడుతూ… “నేను, ప్రభాస్ కలిసి ఉన్న ఈ పిక్ నాకు చాలా మెమొరబుల్. ఎందుకంటే.. ఆ టైంలో నేను ప్లాపుల్లో ఉన్నాను. 2014 ఫిబ్రవరి నెలలో నేను నటించిన ‘ఆహా కళ్యాణం’ (Aaha Kalyanam) ‘పైసా’ (Paisa) సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి.

అవి రెండు ఫ్లాప్ అయ్యాయి. నా బర్త్ డే మంత్ అలా 2 ప్లాపులు పడేసరికి.. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. నేను చాలా డల్ అయ్యాను. ఆ ఏడాది నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకూడదు అని భావించి సైలెంట్ గా ఉన్నాను. అలాంటి టైంలో ప్రభాస్ అండ్ ‘బాహుబలి’(Baahubali) టీం నా ఆఫీస్ కి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారు. వాళ్లందరితో కలిసి నా బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాను” అంటూ ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కథని రివీల్ చేశాడు నాని.

కజిన్ పెళ్ళిలో భార్య, కూతురుతో కలిసి సందడి చేసిన బన్నీ.. ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus