ప్రపంచంలో ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ నెపోటిజం ఉంటుంది. కానీ అందరూ వేలెత్తి చూపించేది రెండు రంగాల్లోనే. ఒకటి సినిమా అయితే, రెండోది రాజకీయం. పాలిటిక్స్ సంగతి మనకు అక్కర్లేదు కాబట్టి.. సినిమా గురించే మాట్లాడుకుందాం. ‘నెపోటిజం’ ఉపయోగం తొలి సినిమా వరకే అని తెలిసినా కూడా కంగన రనౌత్ లాంటి కొంతమంది దేశోద్ధారకులు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. నెపోటిజం వల్ల మిగిలినవాళ్లు అణచివేతకు గురవుతున్నారని అంటుంటారు. దీనిపై చాలామంది స్పందించారు. అయితే టీవీ స్టార్లు స్పందించింది చాలా తక్కువ.
‘కార్తిక దీపం’ సీరియల్‌తో బుల్లితెర స్టార్ హీరో అయిపోయాడు నిరుపమ్ పరిటాల. అతను కూడా నెపోటిజం వల్లనే రాణిస్తున్నాడనే మాటలు అక్కడక్కడా వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల నెపోటిజంపై స్పందించారు. ‘‘నేను బ్యాక్ గ్రౌండ్‌తోనే సీరియల్ అవకాశాలు సంపాదిస్తున్నాను అనేవారికి నేను చెప్పే సమాధానం ఒకటే. టాలెంట్ లేకుండా బ్యాక్ గ్రౌండ్‌తోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అని అనుకుంటే ఒకటి, రెండు సీరియల్స్‌కే దుకాణం సర్దేసేవాణ్ని. ఇన్ని సీరియల్స్, ఇన్నేళ్లు పాటు చేసేవానణ్ని కాదు కదా’’ అని సమాధానమిచ్చాడు నిరుపమ్.
నెపోటిజం గురించి మాట్లాడే అందరికీ చాలామంది సమాధానాలు చెప్పే ఉంటారు. చెబుతూనే ఉంటారు.. చెబుతారు కూడా. కానీ ఈ ప్రస్తావన ఆగదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అవకాశాలు సంపాదిస్తున్నప్పుడు ఈ ఆరోపణలు ఉండవు, అవకాశాలు బాగా వచ్చాక స్టార్ అయిపోతేనో, లేక అవకాశాలు ఆగిపోయి ఇబ్బందుల్లో ఉంటేనే ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయనేది సినిమా ఇండస్ట్రీని చూస్తుంటే తెలుస్తుంది. అయినా ప్రజలకు ఎంటర్‌టైన్ చేశాడో లేదో కావాలి.. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాడా, లేక డైరెక్ట్‌గా వచ్చాడా అనేది అక్కర్లేదు. ఈ విషయాన్ని ‘నెపోటిజం’ టాపిక్ భుజానికెత్తుకున్న వాళ్లకు ఎప్పటికి తెలుస్తుందో అంటూ నెటిజన్లు తరచూ కామెంట్లు చేస్తుంటారు.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!