తెలుగు సినిమా రేంజ్ ను ‘బాహుబలి’ ఎంత పెంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే తెలుగు సీరియల్స్ రేంజ్ ను కూడా ‘కార్తీక దీపం’ అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేసే ఛానల్ ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తుంది. ‘బాహుబలి1’ రిలీజైన తరువాత ‘కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే డౌట్ ‘బాహుబలి2’ రిలీజయ్యే వరకూ దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతూనే వచ్చింది. అలాగే ‘డాక్టర్ బాబు ..
వంటలక్క ఎప్పుడు కలుసుకుంటారు’ అంటూ ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్లు గత రెండున్నరేళ్ళుగా జరుగుతూనే వస్తున్నాయి. సరే ఇది పక్కన పెడితే.. వంటలక్క పాత్ర చేసే ప్రేమీ విశ్వనాథ్.. ‘కార్తీక దీపం’ టీం కు గుడ్ బై చెప్పిందని ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదు.. లాక్ డౌన్ తరువాత జరిగిన మొదటి షెడ్యూల్ పూర్తవ్వడంతో ఆమె సొంత ఊరు అయిన కేరళకు బయల్దేరిందట.
‘ప్రస్తుతానికి నా షూటింగ్ పూర్తయ్యింది. కాబట్టి ప్యాకప్ చెప్పేస్తున్నాను. ఇక నేను కేరళ వెళ్లాలి. అక్కడ నుండీ మీతో టచ్లో ఉంటాను. అక్కడికి వెళ్లాక కేరళ విషయాలు చెబుతాను’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది మన వంటలక్క. ప్రేమీ ఈ విషయం చెప్తున్న సందర్భంలో అక్కడికి వచ్చిన శౌర్య ( బేబీ క్రితిక).. ‘వంటలక్క షూటింగ్ మాత్రమే పూర్తయ్యింది.. నాది ఇంకా ఒక రోజు షూటింగ్ బ్యాలన్స్ ఉంది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.