’90.ఎం.ఎల్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మరికొండ నటించిన తాజా చిత్రం ’90.ఎం.ఎల్’. శేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదలయ్యింది. మద్యం తాగకపోతే చనిపోయే డిసార్డర్ ఉన్న హీరోకి తన ప్రేమ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారుతుంది. చివరికి దానిని హీరో ఎలా ఓవర్ రైడ్ చేసాడు అన్నది మిగిలిన కథ. మొదటి షో తోనే ఈ చిత్రం డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ టీజర్, ట్రైలర్ లతో మొదటినుండీ క్రేజ్ ఏర్పరుచుకోవడంతో మొదటి వారం మంచి కలెక్షన్లను రాబట్టిందనే చెప్పాలి.

నైజాం 0.93 cr
సీడెడ్ 0.33 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.15 cr
కృష్ణా 0.22 cr
గుంటూరు 0.21 cr
నెల్లూరు 0.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 cr
ఓవర్సీస్ 0.06 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.74 cr (share)

ఈ చిత్రానికి 3.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావలి అంటే 0.80 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటివారం పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. ’90 ఎం.ఎల్’ బాగానే క్యాష్ చేసుకుంది. అయితే ఈ వారం ‘వెంకీమామ’ వంటి పెద్ద సినిమా వచ్చింది కాబట్టి ఇక కష్టమనే చెప్పాలి. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వరకూ రాబడుతుందో చూడాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus