సంక్రాంతికి బాక్సాఫీసు బరిలో నిలవాల్సిన ఓ సినిమా అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి భారీ విజయం కూడా అందించారు. ఆ సినిమానే ‘అయలాన్’. శివకార్తియేయన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో కథానాయకుడు శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పొంగల్ సందర్భంగా తమిళనాటల రిలీజ్ అయిన ‘అయలాన్’ అదే పేరుతో తెలుగులో వస్తోంది. రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరో కార్తికేయ గుమ్మకొండ, యువ దర్శకులు గోపీచంద్ మలినేని, వశిష్ఠ విచ్చేశారు. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ కార్తికేయ తమిళ ప్రేక్షకులకు తెలుసు. కార్తికేయ, శివ కార్తికేయన్‌కు మధ్య తేడా ఒక్కటే. అదే అతని జిమ్ బాడీ అని చెప్పాడు.
సినీ నేపథ్యంలేని మాలాంటివాళ్లకు శివ కార్తికేయన్ స్ఫూర్తి. తను ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్నవాళ్లను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన్ను చూడొచ్చనే ఆసక్తితోనే ఈవెంట్‌కు వచ్చా అని శివకార్తికేయన్‌ను కార్తికేయ పొగిడేశాడు. అంతకుముందు శివకార్తికేయన్ మాట్లాడుతూ సైన్స్ ఫిక్షన్ చిత్రాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ‘అయలాన్’లోకి గ్రహాంతర వాసిని తీసుకొచ్చి మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేశాం అని చెప్పాడు.
ఇక కార్తికేయ తమిళ ప్రేక్షకులకు ఎలా పరిచయమో… శివకార్తికేయన్ (Sivakarthikeyan) తెలుగు ప్రేక్షకులకు అలానే పరిచయం కూడా. మొన్నీమధ్యే ‘ప్రిన్స్’ సినిమాతో అలరించాడు. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ భలే ఉంటుంది. సినిమా ఫలితం కాస్త అటుఇటు ఉన్నా శివకార్తికేయన్ నటన అయితే అదిరిపోయింది. ఇక తమిళంలో అయితే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇక కార్తికేయ ‘వలిమై’ సినిమాతో తమిళంలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం అందుకున్నా ఆ తర్వాత అలాంటి ఆలోచన అయితే చేయలేదు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!