నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ… ‘కార్తికేయ’ చిత్రంలో లానే ఎన్నో ట్విస్ట్ లతో రూపొందింది. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మూడో వారం కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
నిన్న 18 వ రోజున వినాయక చవితి హాలిడే కలిసి రావడంతో ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
12.38 cr
సీడెడ్
4.59 cr
ఉత్తరాంధ్ర
4.19 cr
ఈస్ట్
2.46 cr
వెస్ట్
1.59 cr
గుంటూరు
2.56 cr
కృష్ణా
2.08 cr
నెల్లూరు
1.01 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
30.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.70 cr
ఓవర్సీస్
5.75 cr
హిందీ మరియు ఇతర వెర్షన్లు
12.59 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
51.90 cr
‘కార్తికేయ 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం 19 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.51.9 కోట్ల షేర్ ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కు దగ్గరవుతుంది.
ఇప్పటివరకు బయ్యర్లకు ఈ మూవీ రూ.33.9 కోట్ల లాభాలను అందించింది. నిన్న వినాయక చవితి హాలిడే ఈ మూవీకి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. దీంతో నిన్న కూడా వరల్డ్ వైడ్ గా రూ.2 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసింది.