‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన తాజాగా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసాడు. కార్తీ గత చిత్రం ‘దేవ్’ డిజాస్టర్ అవ్వడంతో.. మొదట ఈ ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తున్నట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ట్రైలర్ విడుదలయ్యాక కొంత మేర అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.
నైజాం | 1.18 cr |
సీడెడ్ | 0.63 cr |
ఉత్తరాంధ్ర | 0.45 cr |
ఈస్ట్ | 0.32 cr |
వెస్ట్ | 0.21 cr |
కృష్ణా | 0.31 cr |
గుంటూరు | 0.24 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ + తెలంగాణ | 3.61 cr |
ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈవెనింగ్ షోస్ నుండీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. రోజు రోజుకి ‘ఖైదీ’ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 3.51 కోట్ల షేర్ ను రాబట్టింది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు జరిగాయి. అంటే మరో 50 లక్షలు రాబడితే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. వీకెండ్ పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి.
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!