‘ఖైదీ’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’ బ్యానర్ పై ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌ , ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన తాజా చిత్రం ‘ఖైదీ’. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్ట్ చేసాడు. ఈ డైరెక్టర్ మొదట సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక కార్తీ గత చిత్రం ‘దేవ్’ కూడా డిజాస్టర్ కావడంతో.. మొదట ‘ఖైదీ’ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్టు కూడా చాలా మందికి తెలీదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ అధినేత రాధామోహన్ రిలీజ్ చేసాడు.

నైజాం 2.22 cr
సీడెడ్ 0.92 cr
ఉత్తరాంధ్ర 1.25 cr
ఈస్ట్ 0.52 cr
వెస్ట్ 0.42 cr
కృష్ణా 0.80 cr
గుంటూరు 0.70 cr
నెల్లూరు 0.32 cr
ఏపీ + తెలంగాణ 7.15 cr

ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారానికే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు ఈ చిత్రం కొన్న ప్రతీ బయ్యర్ కు లాభాలు తెచ్చిపెట్టింది. మధ్యలో చాలా సినిమాలు వచ్చి వెళ్ళినప్పటికీ ఈ చిత్రం డీసెంట్ రన్ కొనసాగిస్తూనే వచ్చింది. ఇక నిన్నటితో ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ఫైనల్ గా ఈ చిత్రం 7.15 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ కి ఈ చిత్రంతో బ్లాక్ బస్టరే కొట్టాడని చెప్పాలి.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus