Kartikeya: కార్తికేయ కాబోయే భార్య గురించి తెలుసా?

యువ కథానాయకుడు కార్తికేయ త్వరలో ఓ ఇంటివాడు అవ్వబోతున్న విషయం తెలిసిందే. తన చిన్న నాటి స్నేహితురాలు లోహితను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది కూడా. అంతేకాదు మొన్నీమధ్య ‘రాజావిక్రమార్క’ ప్రచార కార్యక్రమంలో తన భార్యను స్టేజీపైకి పిలిచి అందరి ఎదుట ప్రపోజ్‌ చేశాడు కూడా. తాజాగా ఆమె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. దాంతోపాటు స్టేజీ మీద ప్రపోజ్‌ చేశాక లోహిత ఏమన్నారనేది కూడా చెప్పుకొచ్చాడు.

కార్తికేయ వేదిక మీద లోహితకు ప్రపోజ్‌ చేసిన తర్వాత… ‘ముందే చెప్పుంటే నేను సిద్ధమై వచ్చేదాన్ని కదా, అయినా నువ్వు ఇలాంటివి చేయవు కదా’ అని అన్నారట. లోహిత, కార్తికేయ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్నారు. తన ప్రేమ విషయం కార్తికేయ ఫోన్‌లో అని చెప్పడం తప్ప… ఎప్పుడూ ప్రపోజ్‌ చేయలేదట. అందుకే ఆమెకు సర్‌ప్రైజ్‌ ఇచ్చినట్టు ఉంటుందని అలా చేశారట. దాంతోపాటు ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది కదా అని అలా చేశారట.

కార్తికేయ ‘ఆర్ఎక్స్‌ 100’లో ఘాటు సన్నివేశాలుంటాయి. మరి వాటిని లోహిత చూశారా? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. దానికీ కార్తికేయ సమాధానమిచ్చాడు. ఆ సినిమాకి ముందే ఇద్దరూ గొడవపడ్డారట. దాంతో లోహిత ఆ సినిమా చూడలేదట. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టాక చూస్తా అంటే… కార్తికేయ వద్దన్నారట. ఒకవేళ ఎప్పుడైనా చూస్తానంటే మాత్రం సెకండ్‌ హాఫ్‌ నుంచి చూపిస్తా అని చెప్పాడు కార్తికేయ.

లోహిత సివిల్‌ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌ అట. కాలేజీలో ఆమె ఎప్పుడూ చదువుతూ ఉండేదట. ఆ సమయంలో కార్తియే బయట ఆడిటోరియంలో డ్యాన్స్‌లు చేస్తుండేవాడట. ఈ విషయం కూడా కార్తికేయనే చెప్పుకొచ్చాడు. ఇంట్రెస్టింగ్‌ కదూ. సినిమాల్లో చూపించే సీన్‌ బయటక జరగడం, అది కూడా సినిమా వాళ్లే జరగడం. గాడ్‌ మస్ట్‌ బీ క్రేజీ.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus