పవర్ స్టార్ పవన్ కల్యాణ్….అభిమానులకు దేవుడు…అయితే పవన్ ఇప్పుడు కేవలం సినిమా హీరో మాత్రమే కాదు…పవన్ ఒక సోషియల్ రెస్పాన్సిబల్ లీడర్…జనసేన అధినేత….రాబోయే రోజుల్లో పాలిటిక్స్ లో కీలకంగా మారనున్న నేత….ఇది ఇప్పుడు పవన్ అంటే అందరికీ ఉన్న అభిప్రాయం…అయితే అదే క్రమంలో పవన్ ఇప్పుడు తన సినిమా ‘కాటమరా యుడు’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే…ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి…పేరుకి ఫక్తు తమిళ కమర్షియల్ సినిమా అయినప్పటికే….ఈ మూవీ కోసం పవన్ అభిమానులు చాలా శక్తిగా ఎదురు చూస్తున్నారు…ఇదిలా ఉంటే….ఈ సినిమా విషయంలో….పవన్ కాటమ రాయుడు పాటల విషయంలో అభిమానులు షాక్ లో ఉన్నట్లు సమాచారం…దానికి గల కారణాలు ఏంటి అంటే…ఈ మూవీ పాటలను ఒకొక్కటిగా విడుదలచేయడం ఈమూవీ పాటల పై పెట్టుకున్న అంచనాలను తారుమారు చేస్తోంది అంటూ పవన్ అభిమానులు మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఇప్పటివరకు విడుదలైన పాటలలో ఒక్క ‘మిర మీరా మీసం’ తప్ప మరి ఏపాట ట్యూన్ క్యాచీగా లేకపోవడమే అనిఅంటున్నారు. ఇప్పటివరకు ఈమూవీకి సంబంధించిన నాలుగు పాటలు విడుదలైనా ఒక్క టైటిల్ సాంగ్ తప్పించి మరి ఏసాంగ్ విషయంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ప్రతిభ కనిపించకపోవడంతో ఈమూవీకి అనూప్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి తప్పు చేసారు అన్న భావనలో పవన్ అభిమానులు ఉన్నట్లు టాక్.
దీనికితోడు ఈమూవీ పాటలను ఒకేసారి విడుదల చేయకుండా అంచెలంచలుగా విడుదల చేయడంవల్ల ఈమూవీ ఆడియోకి రావలసిన హైక్ ఏమాత్రం రాలేదు అన్నభావన పవన్ అభిమానులలో ప్రస్తుతం ఉంది. ఇక ట్రైలర్ విషయమే తీసుకుంటే…ఈ సినిమా ట్రైలర్ ని సినిమా విడుదలకు నాలుగు రోజులు ముందు విడుదల చేసి…ఈ సినిమాకు ఎలా అయినా హైప్ తీసుకురావాలి అనేది చిత్ర యూనిట్ ప్లాన్…అయితే ఇక్కడ చిక్కు ఒకటి ఉంది అది ఏంటి అంటే…..ఈ సినిమా ట్రైలర్…’బాహుబలి 2′ ట్రెయిలర్ తర్వాత ఈట్రెయిలర్ వస్తోంది కాబట్టి సామాన్య ప్రేక్షకులు ఈరెండు సినిమాల ట్రైలర్స్ ను పోల్చిచూసే ప్రమాదం ఉంది అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. దీనితో ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చినా ‘బాహుబలి 2’ ట్రైలర్ వ్యూస్ కోట్ల ముందు ఇవి ఆనవు. మొత్తంగా చూసుకుంటే బాహుబలి ఎఫెక్ట్ ఒక పక్క ఉంటే….ఈ సినిమా పాటలు మరో పక్క ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్నాయి అని టాక్…చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.