పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సారి ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన కాటమరాయుడు శుక్రవారం రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ తో భారీ వసూళ్లను రాబడుతోంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ అన్ని కాటమరాయుడులో ఉండడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ శరత్ మరార్ నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 45 కోట్ల (గ్రాస్)ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. కేవలం అమెరికాలోనే ఈ సినిమా 8 కోట్లను రాబట్టినట్లు వెల్లడించారు. తెలుగురాష్ట్రాల్లో గ్రాస్ 35 కోట్లు, షేర్ 23 .67 కోట్లు రాబట్టినట్లు స్పష్టం చేశారు. అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుండడంతో ఈ ఆదివారం నాటికి వంద కోట్ల క్లబ్ లో కాటమరాయుడు చేరిపోతాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు తెలుగురాష్ట్రాల్లో కాటమరాయుడుకి వచ్చిన షేర్ (కోట్లల్లో) ఏరియాల వారీగా..
వైజాగ్ – 3.01
ఈస్ట్ గోదావరి – 3.56
వెస్ట్ గోదావరి – 2.91
కృష్ణ – 2.00
గుంటూరు – 2.96
నెల్లూరు – 1.32
నైజాం – 4.96
సీడెడ్ – 2.95
మొత్తం – 23.67
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.