నేటి నుంచి ‘కాటమరాయుడు’ షూటింగ్

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ‘కాటమరాయుడు’ గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ నేటినుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. ‘శృతి హాసన్’ కథానాయికగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కిషోర్ కుమార్ పార్దసాని’ (డాలి) దర్శకుడు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్, లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus