విశాల్ కెరీర్‌లో మరో పెద్ద హిట్ మూవీ అవుతుంది – శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరీకృష్ణ
పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్ కమర్షియల్ హిట్స్ తర్వాత విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బేనర్‌పై పాండ్యరాజ్ దర్శకత్వంలో మాస్ హీరో విశాల్ నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కథకళి’. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వీరప్పన్’ వంటి సంచలన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరీకృష్ణ ‘కథకళి’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరీకృష్ణ మాట్లాడుతూ – ”మాస్ హీరోగా విశాల్‌కి తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. అతను చేసిన సినిమాలన్నీ తెలుగులో ఘనవిజయం సాధించాయి. మాస్ హీరోగా, యాక్షన్ హీరోగా తన ప్రతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న విశాల్ లేటెస్ట్ మూవీ ‘కథకళి’ తమిళ్‌లో ఇటీవల విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. మంచి కథ, కథనాలతో, ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఎంతో లావిష్‌గా రూపొందిన డెఫినెట్‌గా తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మా శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై విడుదల చేస్తున్నాం. విశాల్ పెర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా రూపొందిన ‘కథకళి’ అతని కెరీర్‌లో మరో అద్భుత చిత్రంగా నిలిచిపోతుంది” అన్నారు.
తెలుగులో ‘కథకళి’ డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్‌గా అందర్నీ అలరిస్తుంది
నిర్మాత, హీరో విశాల్ మాట్లాడుతూ – ”పందెం కోడి నుంచి ఇప్పటివరకు నేను చేసిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు చాలా ఎంతో ఆదరించారు. లేటెస్ట్‌గా ‘కథకళి’ చిత్రంతో వస్తున్నాను. తమిళ్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. మంచి కథ, సస్పెన్స్, థ్రిల్ చేసే ఫైట్స్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు నేను సినిమాల్లో ఒక డిఫరెంట్ జోనర్‌లో రూపొందిన సినిమా ఇది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఒకరోజులో జరిగే కథని డైరెక్టర్ పాండ్యరాజ్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో ‘కథకళి’ డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్‌గా అందర్నీ అలరిస్తుంది. శశాంక్ వెన్నెలకంటి అద్భుతమైన డైలాగ్స్ రాశారు. చిన్న పిల్లల సబ్జెక్ట్స్‌తో సినిమాలు తీసి నేషనల్ అవార్డు గెలుచుకున్న పాండ్యరాజ్ ఓ కొత్త జోనర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రాన్ని మెయిన్ హైలైట్‌గా చెప్పొచ్చు. పాండ్యరాజ్ ఈ కథ చెప్పినప్పుడే నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. యూనివర్సల్ అప్పీల్ వున్న ఈ కథ డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం కలిగింది. తమిళ్‌లో ‘కథకళి’ చిత్రానికి వచ్చిన భారీ ఓపెనింగ్స్, సూపర్‌హిట్ టాక్ నా నమ్మకాన్ని నిజం చేసింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి నుంచి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్నారు పాండ్యరాజ్. ఇలాంటి థ్రిల్లింగ్ మూవీకి మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువగా వుంటుంది. దానికి తగ్గట్టుగానే హిప్ హాప్ తమిళ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. మార్చి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు నా గత చిత్రాల్లాగే పెద్ద హిట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ నాకు వుంది” అన్నారు.
దర్శకుడు పాండ్యరాజ్ మాట్లాడుతూ – ”ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేసుకోవడం జరిగింది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే అంశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడం జరిగింది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ ఊహించలేని సంఘటనలతో పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఒక కొత్త జోనర్‌లో చేసిన ఈ సినిమా తమిళ్‌లో పెద్ద విజయం సాధించి విశాల్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీగా నిలిచింది. ముఖ్యంగా విశాల్ పెర్‌ఫార్మెన్స్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయింది. అలాగే హీరోయిన్ కేథరిన్ గ్లామర్, పెర్‌ఫార్మెన్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. హిప్‌హాప్ తమిళ చేసిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ఎస్సెట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎన్నో అంశాలతో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
మాస్‌హీరో విశాల్ సరసన కేథరిన్ త్రెస జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కరుణాస్, శత్రు, సూరి, శ్రీజిత్ రవి, పవన్, మైమ్ గోపీ, మధుసూదన్‌రావు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం, సంగీతం: హిప్‌హాప్ తమిళ, ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్: అనల్ అరసు, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సమర్పణ: శ్రీకృష్ణ క్రియేషన్స్, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్.