బిగ్‌బాస్ ఫేం కత్తీ కార్తీకపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తీక మధ్యవర్తిత్వం చేసి కోటి రూపాయలకు టోకరా వేసిందనేది ప్రధాన ఆరోపణ. కార్తీకతో పాటు మరో ఆరుగురిపై క్రిమినల్ కేసులను మావోడు చేశారు పోలీసులు. దీంతో మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీంతో కత్తి కార్తీక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
రాజకీయ కక్ష్యతో తనపై కత్తి కట్టారని.. అందుకే తనపై క్రిమినల్ కేసులు పెట్టారని చెబుతోంది. మెదక్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 322, 323, 324, 329లో 52 ఎకరాల స్థలానికి సంబంధించి తాను ఎవరికీ మోసం చేయలేదని.. కావాలనే తనపై కేసులు పెడుతున్నారని వెల్లడించింది. ఈ విషయమై సదరు వ్యక్తికి రెండు నెలల క్రితం లీగల్ నోటీసులు ఇచ్చినట్లు కార్తీక చెప్పుకొచ్చారు. అయితే ఒక్కసారిగా రాత్రికి రాత్రి సివిల్ కేసులో ఛీటింగ్ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది కత్తి కార్తీక.
మొన్నటికి మొన్న తనను చంపుతామని బెదిరిస్తే.. రామాయంపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు కార్తీక తెలిపారు. ప్రజలలో చైతన్య తీసుకురావడానికి ఓ మహిళగా రాజకీయాల్లోకి వస్తే ఇన్ని అడ్డంకులా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. రాజకీయాలను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2023లో దుబ్బాక నుండే పోటీ చేస్తానని.. కత్తి కార్తీక సంచలన ప్రకటన చేశారు.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!