War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన యాక్షన్ మూవీ ‘వార్ 2’. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. ముందు నుండి ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. కానీ 2వ రోజు నుండి డౌన్ అవుతూ వచ్చింది. హిందీలో ఓపెనింగ్స్ వరకు పాస్ మార్కులు పడ్డాయి. కానీ మొదటి సోమవారం నుండి అక్కడ కూడా బాగా డ్రాప్ అయ్యింది.

War 2 Collections

‘యష్ రాజ్ ఫిలింస్’ సంస్థ తమ ‘స్పై యూనివర్స్’ లో భాగంగా రూపొందించిన ఈ సినిమాని తెలుగులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు.అయినా ‘వార్ 2’ కి కలిసి రాలేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 10.30 cr
సీడెడ్  7.83 cr
ఉత్తరాంధ్ర 5.06 cr
ఈస్ట్ 2.79 cr
వెస్ట్ 1.96 cr
గుంటూరు 3.32 cr
కృష్ణా 2.64 cr
నెల్లూరు 1.63 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 35.53 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.20 cr
ఓవర్సీస్ 2.50 cr
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) 41.23(షేర్)

 

‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజుల్లో ఈ చిత్రం రూ.41.23 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.76.8 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.46.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ వరకు కొంతలో కొంత ఓకే అనిపించినా,వీక్ డేస్ లో బాగా డౌన్ అయ్యింది. ఈ వసూళ్లతో అయితే బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.

కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus