ఇండియన్ సినిమాకి వెయ్యి కోట్ల నెరవేర్చిన మొదటి సినిమా అంటే ‘బాహుబలి’. ఆ చిత్రాన్ని తీసింది మన రాజమౌళి. ‘దంగల్’ సినిమా 2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేసినా అది.. జపాన్ (వెర్షన్) కలెక్షన్స్ తో కలుపుకుంటేనే సాధ్యమైంది. అలా రాజమౌళి వల్ల ఇండియన్ సినిమా రేంజ్ పెరిగింది.ఆ తర్వాత ‘పుష్ప 2’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కల్కి 2898 ad’ వంటి సినిమాలు కూడా వెయ్యి కోట్లు కొట్టాయి.
మరోపక్క నార్త్ లో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో వెయ్యి కోట్లు కొట్టాడు. కన్నడ సినిమాకి ‘కె.జి.ఎఫ్ 2’ వెయ్యి కోట్ల కల తీర్చింది. అయితే ఇండియన్ సినిమాల మార్కెట్ పరంగా చూసుకుంటే నార్త్ తర్వాత ఎక్కువ మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా కోలీవుడ్ ఉంది. అలాంటి కోలీవుడ్లో ఇంకా వెయ్యి కోట్ల సినిమా పడకపోవడం నిత్యం చర్చలకు దారితీస్తుంది.
‘కంగువా’ తో ఏకంగా 2 వేల కోట్లు కొడతాం అని నిర్మాత జ్ఞానవేల్ రాజా ధీమాగా ప్రకటించారు. కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది వంద కోట్ల గ్రాస్ కోసమే చాలా కష్టాలు పడింది. అటు తర్వాత కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వెయ్యి కోట్లు కొడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ సినిమా కూడా వంద కోట్ల లోపే ఔట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘కూలీ’ కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా అనుకున్నారు.
కోలీవుడ్ కి వెయ్యి కోట్ల కల తీర్చేది రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ అని అంతా నమ్మారు. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడంతో రూ.500 కోట్ల లోపే అవుట్ అవుతుంది. విజయ్ చివరి సినిమాగా ప్రచారమవుతున్న ‘జన నాయగన్’ కి వెయ్యి కోట్ల సత్తా అయితే లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అట్లీ ‘జవాన్’ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. కానీ తమిళ సినిమాతో చేస్తేనే అది కోలీవుడ్ లెక్కల్లోకి వస్తుంది.