ఈ మధ్య ఒక సినిమా ఒక రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంటే చాలు… వరుసగా అదే డేట్ కి వస్తున్నట్టు మరికొన్ని సినిమాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ మధ్య చూసుకుంటే సెప్టెంబరు 5న ‘మిరాయ్’ వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత అదే డేట్ కి అనుష్క ‘ఘాటి’, రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు వస్తున్నట్టు ప్రకటనలు వచ్చాయి.
ఇప్పుడు అయితే ‘మిరాయ్’ సినిమాని కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 5 నుండి తప్పించి సెప్టెంబర్ 12కి తీసుకెళ్లారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. ఆల్మోస్ట్ అదే ఫిక్స్. అయితే మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ని కూడా అదే డేట్ కి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవి 2 చిన్న సినిమాలు అయితే కాదు. జోనర్ ప్రకారం మంచి క్రేజ్ ఉన్న సినిమాలే..! ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఓ సినిమాకి సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టం. కాబట్టి.. ఈ 2 మిడ్ రేంజ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినా ఇబ్బంది ఉండదు.
కానీ ఈ నెల అంటే ఆగస్టు 27న విడుదల కావాల్సిన రవితేజ ‘మాస్ జాతర’ చిత్రాన్ని.. కొన్ని కారణాల వల్ల వాయిదా చేశారు నాగవంశీ. అందుతున్న సమాచారం ప్రకారం… సెప్టెంబరు 12న ‘మాస్ జాతర’ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. సో ‘మాస్ జాతర’ కనుక సెప్టెంబర్ 12నే వస్తే ఆడియన్స్ కి ఆ సినిమా ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన 2 సినిమాలు కంటెంట్ తో అలరించి తమ పొజిషన్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.