‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతనాన్నేఅనాథలు అంటారు’ అంటూ జబర్దస్త్ షోలో హైపర్ ఆది చెప్పిన డైలాగ్ పెద్ద దుమారం రేపింది. అలాగే అనాథశరణాలయం అనే బోర్డు పెట్టి అవహేళన చేస్తూ.. అ అంటే అమ్మ, నా అంటే నాన్న, ద అంటే దగ్గర పెరగనటువంటి ఈ పిల్లల సంరక్షణ చూసుకోవలసిన భాద్యత ఈ సమాజానిది.. అంటూ అనాధలకు కొత్త అర్ధం చెప్పిన ఆదిపై ఆనాధలు విరుచుకుపడుతున్నారు. అనాధ పిల్లలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ బాలల హక్కులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన కింద హైపర్ ఆది, జబర్ధస్త్‌పై అనాధ పిల్లలు కేసు నమోదు చేశారు.
వీరి మధ్యలోకి కత్తి మహేష్ వచ్చి అనాధ పిల్లలకు పూర్తి మద్దతు తెలుపుతున్నానని చెప్పి మరింత వేడి రాజేశారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శించాడని కత్తి మహేష్ పై అభిమానులు కొన్ని రోజులుగా మాటల దాడికి దిగారు. ఆది కూడా తన స్కిట్స్ లో కత్తి మహేష్ పై పంచ్ లు వేశారు. ముందు పొట్ట, వెనుక బట్ట అంటూ ఎగతాళి చేసాడు. ఆ తర్వాత వీరద్దరూ ఓ టీవీ లైవ్ షోలలో కూర్చుని ఒకరినొకరు తిట్టుకున్నారు. గొడవ ఆగిపోయిందనుకున్న సమయంలో అనాధ పిల్లలు కేసు నమోదు చేయడంతో కత్తి మహేష్ రంగంలోకి దిగారు. ”అనాధ పిల్లలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ బాలల హక్కులు మరియు మానవ హక్కుల ఉల్లంఘన కింద హైపర్ ఆది మరియు జబర్ధస్త్‌పై కేసు నమోదు చేస్తున్న అనాధ పిల్లలు. నా ఫుల్ సపోర్ట్ వారికే” అంటూ మహేష్ కత్తి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీనికి ఆది ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.