బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నటి కత్రినా కైఫ్ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఇప్పటికి వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె నటుడు విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నప్పటికీ కత్రినా కైఫ్ ఏమాత్రం విరామం లేకుండా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఇక ఈమె ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాల పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే కత్రినా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ విధంగా తన విషయాలన్నింటినీ అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈమెకు రోజురోజుకు సోషల్ మీడియాలో కూడా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. ఈ విధంగా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా కూడా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆగ్ర హీరోయిన్లందరూ కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగి ఉన్నటువంటి కత్రినా కైఫ్ సైతం ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక్క పోస్ట్ షేర్ చేసిన ఈమె భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఒక్కో పోస్టుకు 97 లక్షలు ఇంచుమించుగా కోటి రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారట.ఈ విధంగా ఒక్క పోస్ట్ ను ప్రమోట్ చేయడంతో కోటి రూపాయలు తీసుకుంటున్నారని తెలియగానే ఎంతోమంది కత్రినా కైఫ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఈమెకు ఉన్న పాపులారిటీ చూసి తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.