చేసిన తప్పునే పదే పదే చేస్తాను అంటున్న హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్!
- September 6, 2017 / 12:46 PM ISTByFilmy Focus
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎవరు అంటే అందులో ఖచ్చితంగా కత్రీనా కైఫ్ పేరు ఉంటుంది. అయితే అందాల ఆరబోతలో కానీ, అభినయంలో ఇరగదీయడంలో కానీ, ఆమె బాలీవుడ్ లో మంచి మార్కులే వేయించుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోని తెలుగు వారిని టచ్ చేసిన ఈ హీరోయిన్ ఈ మధ్య సోషియల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తూ ఉంది. ఆమె ఫోటో పెడితే చాలు లక్షల్లో లోకేస్, వేలల్లో కామెంట్స్ వస్తూ ఉండడంతో…ఆమె అలానే అప్పుడప్పుడు అభిమానుల్ని అలరించేందుకు ఫోటోలు, కొటేషన్స్ పెడుతూ ఉంది.
అయితే తాజాగా ఆమె పెట్టిన కొటేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ కొటేషన్ ఏమా కధ అంటే…తన ఫోటో ఒకటి పోస్ట్ చేసి…‘నేనెప్పుడూ ఒక తప్పును రెండు సార్లు చేయను.. 5, 6 సార్లు చేస్తా. ఎందుకంటే అసలది నిజంగా తప్పేనా అని తెలుసుకోవడానికి..’ అంటూ కత్రినా తన మనసులోని మాటల్ని తన అభిమానులతో పంచుకోగా…అభిమానులు కత్రినా ఫొటో కన్నా.. ఆమె రాసిన మాటలకి ఎక్కువ ఫిదా అయిపోయారు. సరిగ్గా చెప్పావ్ కత్రినా అంటూ తెగ కామెంట్స్ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇంత బిజీ బిజీ లైఫ్ లో కూడా ఫ్యాన్స్ తో కత్రీనా ఇలా టైమ్ ను పంచుకోవడం నిజంగా అభిమానులకి ఆనందాన్ని పంచే అవకాశం అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













