ఇప్పుడు మిస్‌ చేసుకున్నా… మళ్లీ ఎప్పటికైనా వెళ్తా: స్టార్‌ హీరోయిన్‌

మన దేశం నుండి విదేశాలకు వెళ్లి సినిమాలు చేస్తున్న, చేసిన నటీమణులు తక్కువగానే ఉంటారు. అందులోనూ విదేశాల నుండి మన దేశానికి వచ్చి ఇక్కడ అదరగొట్టి విదేశాలకు వెళ్లిన వాళ్లు ఇంకా తక్కువ ఉంటారు. అలాంటి వారి లిస్ట్‌లో చేరాల్సిన కట్రినా కైఫ్‌ (Katrina Kaif) ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. హాలీవుడ్‌ నుండి రీసెంట్‌గా వచ్చిన అవకాశాన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నాను అని చెప్పింది కట్రినా. అయితే మళ్లీ ఛాన్స్‌ వస్తుందని నమ్మకంగా చెబుతోంది. ఇంతకీ ఏమైందంటే?

నాకు మళ్లీ హాలీవుడ్‌ అవకాశం వస్తుంది, ఆ అవకాశం నా సినీ ప్రయాణాన్ని కీలక మలుపు తిప్పుతుంది అని చెప్పింది కట్రినా. అయితే ఏ అవకాశం వచ్చింది, ఎందుకు నో చెప్పింది అనేది మాత్రం తెలుపలేదు. ఈ రోజుల్లో హాలీవుడ్ సినిమా అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఓకే చేస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్లు ఉన్నారు. అలా వెళ్లినవాళ్లు ఒక్క సినిమాకే ఆపేయడమో, అవకాశాలు రాకపోవడమో, సిరీస్‌లు, టీవీ షోలకు పరిమితం అయిపోవడమో చూస్తున్నాం.

ఇలాంటి సమయంలో కట్రినా ఎందుకు హాలీవుడ్‌ ఛాన్స్‌ వదులుకుంది అనేది తెలియాలి. ఇక ఆమె కథానాయిక ప్రయాణం చూస్తే.. హిందీలో ‘బూమ్‌’ సినిమా తర్వాత తెలుగులో ‘మల్లీశ్వరి’ సినిమా చేసింది. ఆ సినిమాతో దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత ‘అల్లరి పిడుగు’ సినిమాలో బాలయ్య సరసన నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా ఆమె ఓకే చేయలేదు.

ప్రేక్షకులకు ఎప్పుడూ తన జీవితంలో మొదటిస్థానం ఇస్తానని చెప్పిన కట్రినా కైఫ్‌.. ఏ కథకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారని ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పింది. ఈ క్రమంలోనే ఎప్పుడూ మంచి కథలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది కట్రినా. ఇటీవల ‘మెర్రీ క్రిస్మస్‌’ అనే తమిళ – హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ.. ఇప్పుడు కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus