‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య థాపర్ (Kavya Thapar). ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. అయితే ‘యూవీ’ బ్యానర్లో సంతోష్ శోభన్ (Santosh Sobhan) హీరోగా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha).. హీరోయిన్ గా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా వల్ల ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చాయి. కానీ థియేట్రికల్ గా మాత్రం ఈమెకు సరైన సక్సెస్ పడలేదు. రవితేజతో (Ravi Teja) చేసిన ‘ఈగల్’ (Eagle) పెద్దగా ఆడలేదు.
సందీప్ కిషన్ (Sundeep Kishan) తో చేసిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) పర్వాలేదు అనిపించినా.. కావ్య పాత్రకి ప్రశంసలు ఏమీ దక్కలేదు. అసలు ఆ సినిమాలో ఆమె నటించింది అంటే.. గుర్తు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. అలా ఉంటుంది అందులో ఆమె పాత్ర. సరే అక్కడి వరకు ఎలా ఉన్నా.. తర్వాత కూడా ఈమెకు ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సూపర్ హిట్ సీక్వెల్లో ఛాన్స్ లభించింది. ఊహించని విధంగా ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
‘డబుల్ ఇస్మార్ట్’ కావ్య చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. కానీ ఆమె గ్లామర్ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు.ఇప్పుడు కావ్య చేతిలో ఒకే ఒక్క పెద్ద సినిమా ఉంది. అదే ‘విశ్వం’ (Viswam) , శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో గోపీచంద్ (Gopichand ) హీరోగా రూపొందుతున్న మూవీ ఇది. టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల మార్క్ టీజర్ చూసిన ఫీలింగ్ అందరికీ కలిగింది. అక్టోబర్ 11 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
‘విశ్వం’ మూవీ సక్సెస్ అందరికీ ముఖ్యమే. హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల.. వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. వాళ్ళకి ఎలా ఉన్నా.. హీరోయిన్ కావ్యకి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే.. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు.. ఇప్పుడు వస్తున్న పారితోషికం దక్కదు. పైగా నటిగా అయితే ఈమె ప్రూవ్ చేసుకుంది లేదు. ఇప్పటివరకు గ్లామర్ పైనే ఆధారపడుతూ వచ్చింది.