Keeravani: మణిశర్మ ఆవేదన.. కీరవాణి ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో పెద్ద సినిమా అంటే.. దానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని అంతా భావించేవారు. ఆయన హవా అప్పట్లో అలా ఉండేది. అలాగే ఇప్పటి ట్రెండ్ ను బట్టి.. రేసులో ఆయన వెనకబడిపోయారు అనడం కూడా కరెక్ట్ కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఈజీగా మైండ్లో నుండి పోవు.

ఆ సినిమా సక్సెస్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు ‘నారప్ప’ , ‘రెడ్’, ‘సీటీమార్’ వంటి సినిమాలకు కూడా మణిశర్మ మంచి ఔట్పుట్ ఇచ్చాడు. అయితే స్టార్ హీరోలు ఆయనకు ఛాన్సులు ఇవ్వడం లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. వంటి స్టార్ హీరోలు తమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి వరుసగా రెండు, మూడు ఛాన్సులు ఇస్తున్నారు.

నేనేమంటాను అంటే.. వాళ్లకు 2 ఛాన్సులు ఇస్తే.. నాకో(మణిశర్మకు) లేదంటే కీరవాణి గారికో ఒక్కో ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు ప్రేక్షకులకి చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది’ అన్నట్టు చెప్పుకొచ్చాడు. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ పై కీరవాణిని ప్రశ్నించగా.. “అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..లు ఆలోచించుకోవాలి. బహుశా మణిశర్మ గారి వద్ద మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అయ్యే ట్యూన్ ఏదో ఉండి ఉండవచ్చు.

అది చిన్న హీరోకి, మిడ్ రేంజ్ హీరోకి సెట్ అవ్వదు, మహేష్ బాబుకు సెట్ అవ్వుద్ది అనే ఉద్దేశం ఆయన కలిగి ఉండవచ్చు. ‘నా దగ్గరైనా నిమ్మకూరు మొనగాడా’ అనే మంచి ట్యూన్ ఉంటే అది ఎన్టీఆర్ గారికే సెట్ అవ్వుద్ది అనుకుంటాను కానీ వేరే హీరోకి పెడితే అది సెట్ అవ్వదు కదా.! అదే మణిశర్మ గారి ఉద్దేశం కూడా అయ్యుండొచ్చు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు (Keeravani) కీరవాణి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus