బిగ్ బాస్ హౌస్ అనేది ఎమోషన్స్ తో కూడుకున్నది. ఎప్పుడూ టాస్క్ లు ఆడటం, విన్నర్స్ అవ్వడమే కాదు, మనలోని నెగిటివిటీని అవతలివాళ్లు చెప్పినపుడు ఎమోనల్ కూడా అయిపోతారు. హౌస్ మేట్స్ ముఖ్యంగా వాళ్ల గురించి చెప్పినా, లేదా వాళ్లని తక్కువ చేసి మాట్లాడినా బాగా బాధపడిపోతుంటారు. ఇప్పుడు కీర్తి భట్ విషయంలో అదే జరుగుతోంది. ఆమె గేమ్ ఆడటం అంటే ఇంట్లో సభ్యులందరితో మంచిగా ఉండటం అనుకున్నట్లుగా ఉంది. అందుకే, అందరితో స్నేహభావంగా ఉంటోంది. కానీ, హౌస్ మేట్స్ మాత్రం గేమ్ అస్సలు ఆడట్లేదని, టెలికాస్ట్ అయ్యే 60 నిమిషాల్లో నీ పర్సెంటేజ్ జీరో అని ఓట్లు వేశారు.
అసలు కీర్తి విషయమే టాస్క్ లో చర్చకి రావట్లేదు. ఇదే విషయంలో వాసంతీ కూడా బాధపడింది. అస్సలు ఇంట్లో మనల్ని పట్టించుకోవడం లేదని, టాస్క్ ఆడేటపుడు కూడా కార్నర్ చేసేస్తున్నారని చెప్పింది. ఇక జీరో టైమ్ ట్యాగ్ వేసుకున్న కీర్తి బాగా బాధపడింది. ఇంట్లో నేను అందరితో బాగున్నాను అని, అయినా కూడా ఇంట్లో వాళ్లు ఇలా అంటే తీస్కోలేకపోతున్నానని చెప్పింది. దీంతో ఆరోహి , ఇంకా అర్జున్ ఇద్దరూ కీర్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. నిజానికి కీర్తి భట్ తన జీవితంలో జరిగిన సంఘటన చెప్పినపుడు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
అయ్యో పాపం అంటూ జాలిపడ్డారు. సోషల్ మీడియాలో కూడా కీర్తి కి జరిగిన సంఘటన పగవారికి కూడా రాకూడదని కామెంట్స్ చేశారు. కానీ, గేమ్ పరంగా చూస్తే కీర్తి డల్ అయిపోయింది. దొంగల టాస్క్ లో దొంగల టీమ్ లో ఉన్న కీర్తి వేరేవాళ్లతో పోటీ పడలేకపోయింది. ఒక్క ఇనయపై అరవడం తప్పితే గేమ్ లో ఎక్కడా తను కనిపించలేదు. అంతేకాదు, గేమ్ ప్లాన్ చేయడం, ఎదుటి వారి గేమ్ ని అబ్జర్వ్ చేయడం కూడా లేదు.
తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. దీంతో చంటి కీర్తి గేమ్ ని కామెంట్ చేశాడు. ఎవరి గేమ్ ప్లాన్ వాళ్లకి ఉందంటూ, ఎవరూ ఇక్కడ చిన్నపిల్లలు కాదంటూ చెప్పాడు. పక్కనే ఉన్న సుదీప చంటి కామెంట్స్ ని ఖండించింది. కీర్తికి ఇంట్లోనే ఉండాలని ఉందని, గేమ్ పరంగా తనకి ఎలాంటి ప్లాన్స్, స్ట్రాటజీలు లేవని చెప్పింది. నిజానికి కీర్తికి ఉన్న ప్రాబ్లమ్ కూడా అదే. పక్కవారి గేమ్ ని అబ్జర్వ్ చేయడం, లేదా వేరే వాళ్ల గేమ్ ని ఎనలైజ్ చేయడం చేయదు.
నామినేషన్స్ అప్పుడు కూడా లాజిక్స్ వర్కౌట్ చేయదు. తనకి అనిపించిన వారిని నామినేట్ చేసేస్తుంది. ఒకవైపు ఉండటం కానీ, గ్రూప్ గా గేమ్ ఆడటం కానీ చేయదు. అందువల్లే మూడువారాలుగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నా కూడా చెప్పుకొదగ్గ హైలెట్స్ ఏమీ లేకుండా పోయాయి. మరి రానున్న వారాల్లో అయినా కీర్తి గేమ్ , పెర్ఫామన్స్ మెరుగవుతుందా లేదా అనేది చూడాలి.