Keerthi Bhatt: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ పై కీర్తి ఫైర్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కీర్తి భట్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. కీర్తి భట్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అమర్ దీప్ ఫ్యాన్స్ పై ఫైర్ అవుతూ కీర్తి భట్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల నుంచి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయని బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్ కు నేను వెళ్లానని కీర్తి భట్ వెల్లడించారు.

అప్పుడు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చానని అందులో ఎవరి గురించి చెడుగా చెప్పలేదని ఆమె అన్నారు. కానీ అమర్ ఫ్యాన్స్ మాత్రం నన్ను చండాలమైన బూతులు తిడుతున్నారని కీర్తి భట్ కామెంట్లు చేశారు. నీ తల్లి కూడా ఆడదే కదా అని ఆమె కామెంట్లు చేశారు. నేను బిగ్ బాస్ లోపల ఉన్న సమయంలో ప్రియాంక, మానస్, మహేశ్ మాత్రమే నాకు సపోర్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నా సపోర్ట్ ఉంటుందని ఆమె తెలిపారు.

గౌతమ్ ఒంటరిగా ఆడటం నాకు నచ్చిందని కీర్తి భట్ చెప్పుకొచ్చారు. మీకు దండం పెడతానని నా తప్పుంటే అందరి కాళ్లు మొక్కుతానని తప్పు లేకపోతే మాత్రం అస్సలు వదలనని కీర్తి భట్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కామెంట్ల వల్ల చాలా హర్ట్ అవుతున్నానని నా లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నారని అమ్మాయిలను గౌరవించాలని కీర్తి భట్ అన్నారు.

నా తిండి నేను తింటున్నానని ఎవరి దగ్గర అడుక్కోవడం లేదని (Keerthi Bhatt) కీర్తి భట్ చెప్పుకొచ్చారు. వీలైతే మీరు సాయం చేయాలని ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్ లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి రోడ్డుపై కొడతానని మీ అమ్మతోనే కొట్టిస్తానని కీర్తి భట్ తెలిపారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus