Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

కీర్తి సురేశ్‌ ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడాలి అంటే.. ఠక్కున గుర్తొచ్చేది ‘దోశ’. అవును మీరు చదివింది కరెక్టే. ఎందుకంటే ఆమెకు దోశలంటే ఇష్టం, ప్రాణం.. ఇంకా చెప్పాలంటే అంతకుమించి. రోజంతా దోశలు ఇచ్చినా తింటూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఆమె చాలా సార్లు మాట్లాడింది. ఇప్పుడు మరోసారి ఆమె దోశల గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఆమెనే. ఎందుకంటే ఆమె లుక్‌, ఫిజిక్‌ కోసం అడిగితే దోశల్ని ముందుకు తెచ్చిందామెనే.

Keerthy Suresh

కెరీర్ ప్రారంభంలో కీర్తి సురేష్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు. అచ్చమైన దక్షిణాది హీరోయిన్‌లా బొద్దుగా, ముద్దుగా ఉండేది. అయితే ఆ తర్వాత క్రమంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు నాజూగ్గా తయారైంది. ఈ క్రమంలో కొందరికేమో ఆమె పాత లుక్కే బావుందనిపిస్తే.. ఇంకొందరు ఇప్పుడే బెటర్ అంటున్నారు. మరి కొందరేమో రెంటికీ మధ్య లుక్ మెయింటైన్ చేస్తే బాగుండు అని అంటున్నారు. ఈ కామెంట్ల గురించి కీర్తి రియాక్ట్ అయింది. ఈ మేరకు ఆసక్తికర కామెంట్లు చేసింది.

చబ్బీగా ఉన్నపుడే నేను బాగున్నానని కొందరు అంటుండడం నా దృష్టికి వచ్చింది. ఆరోగ్యం, లుక్ విషయంలో తన ఆలోచనల్లో మార్పు ‘మహానటి’ సినిమాతోనే జరిగిందని కీర్తి చెప్పింది. ఆ సినిమా తర్వాతే బరువు తగ్గానని గుర్తు చేసింది. ఒకప్పుడు పది దోసెలు లేదా పది ఇడ్లీలు తినేదానినని, ఇప్పుడు కూడా అలానే తింటునానని చెప్పుకొచ్చింది. అయితే అప్పటికి, ఇప్పటికి తేడా వర్కవుట్లు మాత్రమేనని చెప్పింది కీర్తి సురేశ్‌. ఒకప్పుడు తిండి మాత్రమే ఉండేదని.. వర్కౌట్స్‌ చేసేదానినని కాదని.. ఇప్పుడు వర్కౌట్స్‌ పక్కాగా చేస్తున్నానని స్లిమ్‌ అవ్వడానికి వెనుకున్న కారణం తెలిపింది.

‘మహానటి’ సినిమా తర్వాత ఏడాదిలోనే పది కిలోల బరువు తగ్గానని కీర్తి చెప్పింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా స్కిన్ కేర్ మీద కూడా దృష్టిపెట్టానని కూడా చెప్పింది. ఈ కారణాల వల్లే స్లిమ్‌ లుక్‌లోకి వచ్చానని కీర్తి చెప్పింది.

మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus