ఇండియన్ ఓటీటీ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’కి ఉన్న క్రేజ్ వేరు. అందుకే మూడు సీజన్లు వస్తే.. మూడింటికి మూడూ భారీ ఆదరణ అందుకున్నారు. మూడో సీజన్ వచ్చి రెండు, మూడు రోజులే అయినా ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఈ మాట అనాలని అనిపిస్తోంది. అయితే రెండు సీజన్లు చూసినవాళ్లకు, మూడో సీజన్ ఆ స్థాయిలో లేదు అనే ఫీలింగ్ కలుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే మూడో సీజన్ విషయంలోనూ తొలి సీజన్ కాన్సెప్ట్‌నే సిరీస్ క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే ఫాలో అయ్యారు అని చెప్పొచ్చు.
ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి అలియాస్ మనోజ్ బాజ్‌పాయ్ మరో వచ్చేశాడనే విషయం తెలిసిందే. అయితే సీజన్ ఆఖరులో ఆయన పాత్రకు సరైన ముగింపు లభించలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే విలన్ విషయంలో కూడా క్లారిటీ లేని ముగింపు ఇచ్చారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే తొలి సీజన్ నుండి ఈ సిరీస్‌ను ఫాలో అవుతున్నవాళ్లు తొలి సీజన్‌కి రాజ్ అండ్ డీకే ఎలాంటి స్టైల్ వాడారో ఇప్పుడూ అదే చేస్తున్నారు అని అంటున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ కోసం చైనా సరిహద్దుల్ని కీలకంగా చేసుకుంటూరు అనే వార్తలొచ్చినా.. ఈ సారి కేవలం ఈశాన్య రాష్ట్రాల వరకే వెళ్లారు. చైనా గురించి ప్రస్తావన ఉన్నా.. అది కీలకంగా ఉండదు. ఇక అసలు విషయానికొస్తే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ క్లైమాక్స్ కొంత అయోమయంగా ఉందని చెప్పొచ్చు. ఎందుంకటే సీజన్ చివర్లో విలన్‌ను హీరో పట్టుకోలేకపోయాడు. శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పాయ్) తీవ్రంగా గాయపడి ఊపిరి వదిలేసినట్లుగా షాట్ దగ్గర సిరీస్ ముగించారు.
దీంతో శ్రీకాంత్‌కు ఏమైంది. విలన్ ఏమయ్యాడు అనే ప్రశ్నలతో సిరీస్ ముగిసింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 1’లోనూ ఇలాంటి ముగింపే ఉంటుంది. సీజన్ 2లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 4 తీసుకొచ్చి దాంట్లో క్లారిటీ ఇస్తారని సమాచారం. అయితే అదే ఆఖరి సీజన్ అవుతుంది అని చెబుతున్నారు.