తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ (Keerthy Suresh) బాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఆశించిన రీతిలో జరగలేదు. ‘బేబీ జాన్’ (Baby John) అనే హిందీ చిత్రంతో వరుణ్ ధవన్ (Varun Dhawan) సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తికి తొలి ప్రయత్నమే పెద్ద ఎదురుదెబ్బ ఇచ్చింది. అట్లీ తెరకెక్కించిన తమిళ హిట్ ‘తెరి’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో వచ్చినా, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. కేవలం రూ.39 కోట్ల షేర్‌తో 100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది.
ఈ సినిమాలో కీర్తి పోషించిన డాక్టర్ మీర వర్మ పాత్ర భావోద్వేగాల్లేకుండా ఉందని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ‘మహానటి’లాంటి చిత్రంలో ఆకట్టుకున్న కీర్తి ఈ సినిమాలో మాత్రం మెప్పించలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం మొదలయ్యే ముందే ఆగిపోతుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా బాలీవుడ్ ఆడియన్స్ ఆమెపై ఆసక్తి చూపించే అవకాశాలు తగ్గిపోయాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కీర్తి సురేష్‌కు మరో బిగ్ ఛాన్స్ దక్కబోతోందట. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇది తుది నిర్ణయం కాకపోయినా, చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే లవ్ అండ్ వార్, రామాయణం, ధూమ్ 4 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రణబీర్.. కీర్తితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అది కీర్తి కెరీర్‌కు కొత్త బూస్ట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈసారి కీర్తికి స్క్రిప్ట్, పాత్ర అన్ని కలిసొస్తే తప్పకుండా మంచి గుర్తింపు రావచ్చని అంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆమె, బాలీవుడ్‌లో మళ్లీ రాబోవు అవకాశాన్ని ఉపయోగించుకుంటే, భారీగా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.